కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్, ది హిందూ పత్రికలో రాసిన ఎడిటోరియల్ సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ విధానాల పై, పరకాల ధ్వజమెత్తారు. పతనమైపోతున్న దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే ఎలాంటి చర్యలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకోవటం లేదని అన్నారు. హిందూ పత్రికలో రాసిన ఎడిటోరియల్ లో, కేంద్ర ఆర్థిక మంత్రి భర్త, కేంద్ర విధానాలను తప్పు పట్టటం సంచలనంగా మారింది. దేశ ఆర్ధిక పరిస్థితి, తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందని, జరుగుతున్న వాస్తవాలను కేంద్రం అంగీకరించే పరిస్థితిలో లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్ విధానాలే బాగున్నాయని, నెహ్రు విధానాలను విమర్శించటం మాని, ఇప్పటి కేంద్రం ప్రభుత్వం, పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్ ఎకనామిక్ మోడల్ ని ముందుకు తీసుకువెళ్తేనే, దేశం పుంజుకుంటుందని అన్నారు.

parakala 14102019 2

ఒక పక్క ప్రభుత్వం వాస్తవాలు అంగీరించని ధోరణిలో ఉంటే, ప్రతి రోజు వస్తున్న వార్తలు, డేట్ తో, దేశంలోని ప్రతి రంగం, ఎలా కుదేలు అయిపోతుందో కనిపిస్తుందని అని ఆయాన అన్నారు. వాస్తవాలు అంగీకరించి, దిద్దుబాటు చర్యలు తీసుకోకపొతే, మరింత నష్టపోతాం అని పరకాల అన్నారు. నెహ్రు నెహ్రు అని ప్రతిది అటు వైపు తోయ్యకుండా, ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి భర్త, ఈ వ్యాఖ్యలు చెయ్యటంతో, పెద్ద రాజకీయ దుమారం రేగే అవకాసం ఉంది. ప్రతిపక్ష పార్టీలు, ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అంతే కాక, నరేంద్ర మోడీ ఆర్ధిక విధానాల కంటే, పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్ విధానాలే బాగా ఉండేవని పరకాల ప్రభాకర్‌ కొనియాడటం విశేషం.

parakala 14102019 3

ఆర్ధిక మాంద్యంలో ఉన్న వృద్ధిని పరుగులు పెట్టించేందుకు, కార్పొరేట్‌ పన్నుని తగ్గిస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిణామాలతో, అంతర్జాతీయ సంస్థలు కూడా భారత వృద్ధి రేటును తగ్గించేస్తున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాని ఏకంగా ఒకటిన్నర శాతం కుదించింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20లో 7.5 శాతం ఉంటుందన్న ప్రపంచ బ్యాంకు, ఇపుడు దాన్ని 6 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) నమోదైన 6.8 శాతంతో పోల్చి నా ఇది 0.8 శాతం తక్కువ. వృద్ధి రేటు మరింత నీరసించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. అదే జరిగితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మరిన్ని కష్టాలు తప్పవని స్పష్టం చేసింది.

Advertisements