ఈ మధ్య కాలంలో కొంత మంది పాస్టర్లు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకుంటూ, చేస్తున్న వ్యాఖ్యలు చూస్తున్నాం. అయితే కొన్ని మరీ శ్రుతిమించి ఉన్నాయి. నిన్న బెల్లంపల్లికి చెందిన పాస్టర్ అజయ్ కుమార్ వీడియో ఒకటి, సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది. చంద్రబాబు నాయుడు బలవంతపు మత మార్పిడులు తప్పు అన్నారు అంటూ, ఈ పాస్టర్ రెచ్చిపోయాడు. చంద్రబాబుని అరేయ్, ఒరేయ్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంతే కాదు, ఏమి చేస్తారు, రోజు రోజుకు కాదు, గంట గంటకు మత మార్పిడులు చేస్తాం, ఏమి చేస్తారు అంటూ, సవాల్ విసిరారు. తెలుగుదేశం నాయకులకు కాలర్ పట్టుకుని నిలదీయలు అంటూ, తన ప్రసంగంలో, అక్కడ ప్రజలను రెచ్చగొట్టారు. అయితే ఈ సందర్భంలో మత మార్పిడులు చేస్తాం, గంట గంటకు చేస్తాం అని పాస్టర్ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎవరైనా ఇష్టం వచ్చి మతం మారితే ఎవరూ ఏమి అనలేరు, అది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలా కాకుండా, నేను గంట గంటకు మత మార్పిడులు చేస్తా ఏమి చేస్తావ్ అంటూ, ఒక పాస్టర్, చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు సవాల్ విసిరారు అంటే, ఏమని చెప్పాలి. అయితే ఈ వీడియో పై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయ్యింది. అసలు ఎవరు ఈ అజయ్ కుమార్, ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నాడు అని, తెలుగుదేశం పార్టీ ఆరా తీసినట్టు ఆ పార్టీ నేతలు చెప్పారు.

ajay 17012021 2

అయితే తెలుగుదేశం పార్టీ నేతలు, అజయ్ కుమార్ కు సంబంధించి, కొన్ని సంచలన ఆధారాలు బయట పెట్టారు. ఈ పాస్టర్ అజయ్ కుమార్, జగన్ మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ కు, చాల దగ్గర వాడని, కొన్ని ఫోటోలు విడుదల చేసింది టిడిపి. అంతే కాదు, జగన్ మోహన్ రెడ్డి బంధవు అయిన రవీంద్రనాద్ రెడ్డితో కూడా ఇతను సన్నిహితుడు అని ఫోటోలు విడుదల చేసింది. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనే, తమకు అనుకూలంగా ఉండే పాస్టర్లు ద్వారా, ఇలా చంద్రబాబు గారి పై, తెలుగుదేశం పార్టీ పై, క్రీస్టియన్ లలో విష ప్రచారం చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు గారు ఎక్కడా క్రీస్టియన్ మతాన్ని ఒక్క మాట అనలేదని, చట్టానికి వ్యతిరేకం అయిన బలవంతపు మత మార్పిడులు పై మాట్లాడుతుంటే, వైసీపీ ఇలా తప్పుడు ప్రచారం చేస్తుందని వాపోతున్నారు. తమ పార్టీకి అనుకూలంగా ఉండే పస్టర్ల చేత తప్పుడు ప్రచారం చేపించి, దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని, నిన్న ప్రవీణ్, ఈ రోజు అజయ్ ఉదంతాలు దీనికి ఒక ఉదాహరణ అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

Advertisements