గత కొన్ని రోజులుగా, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేస్తున్నారన్న విషయంపై మెగా అభిమానులు, జనసేన కార్యకర్తల్లో సర్వత్రా ఆసక్తిరేపుతోంది. దీనిపై జనసేనాని ఓ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పార్టీ కార్యవర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని పవన్‌ ట్వీట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం కల్లా పవన్ పోటీ చేసే రెండు స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కొద్ది సేపటి క్రిందట, ఆయన రెండు స్థానాల్లో పోటీ చేస్తారని, అవి విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానాలని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆ పార్టీ కార్యవర్గం మంగళవారం నిర్ణయం తీసుకుంది. పవన్‌కల్యాణ్‌ గాజువాక నుంచి పోటీ చేస్తారని తొలి నుంచీ ప్రచారం జరుగుతోంది. తిరుపతి పేరు మాత్రం అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది.

pawan 1932019

ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ తన సోదరుడు చిరంజీవి బాటను అనుసరిస్తున్నారనే చెప్పాలి. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే చిరంజీవి గెలుపొందారు. ఇప్పుడు పవన్‌ కూడా రెండు చోట్ల పోటీ చేస్తుండగా.. అందులో చిరంజీవి పోటీ చేసిన తిరుపతి స్థానం ఒకటి కావడం గమనార్హం. ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లోని మరో 13 శాసనసభ స్థానాలకు, మరో లోక్‌సభ స్థానానికి జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం అర్ధరాత్రి ప్రకటించారు. ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్చారు. గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించిన షేక్‌రియాజ్‌ తాజా మార్పులో భాగంగా ఒంగోలు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌ పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి పోలూరు శ్రీకాంత్‌నాయుడు పోటీ చేయనున్నారు. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

 

pawan 1932019

శాసనసభ అభ్యర్థులు: 1. టెక్కలి: కణితి కిరణ్‌కుమార్‌, 2. పాలకొల్లు: గుణ్ణం నాగబాబు, 3. గుంటూరు తూర్పు: షేక్‌ జియాఉర్‌ రెహ్మాన్‌, 4. రేపల్లె: కమతం సాంబశివరావు, 5. చిలకలూరిపేట: మిరియాల రత్నకుమారి, 6. మాచర్ల: కె.రమాదేవి, 7. బాపట్ల: పులుగు మధుసూదన్‌రెడ్డి, 8. ఒంగోలు: షేక్‌ రియాజ్‌, 9. మార్కాపురం: ఇమ్మడి కాశీనాథ్‌, 10. గిద్దలూరు: బైరబోయిన చంద్రశేఖర్‌యాదవ్‌, 11. ప్రొద్దుటూరు: ఇంజా సోమశేఖర్‌రెడ్డి, 12. నెల్లూరు నగరం: కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, 13. మైదుకూరు: పందింటి మల్హోత్రా, 14.కదిరి: సాడగల రవికుమార్‌ (వడ్డే రవిరాజు), 15 ఒంగోలు (లోక్‌సభ): బెల్లంకొండ సాయిబాబా.

Advertisements