జగన్ ప్రభుత్వం పై, మరోసారి కేంద్రం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూనే చురకలు అంటించారు. ఇప్పటికే పోలవరం, పీపీఏల విషయంలో జగన్ మోహన్ రెడ్డి పై, కేంద్రం బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విధ్యత్ పీపీఏల పునఃసమీక్ష విషయం, ఇప్పటికీ కేంద్రాన్ని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే ఫ్రాన్స్, జపాన్ దేశాలు కేంద్రానికి, ఈ పీపీఏల సమీక్ష పై, ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. మరో పక్క దావోస్ లో జరిగిన, పెట్టుబడులు సదస్సులో కూడా, చాలా మంది పారిశ్రామిక వేత్తలు, ఇలా ఒక ప్రభుత్వం మారగానే, మరో ప్రభుత్వం వచ్చి ఒప్పందాలు సమీక్ష చేస్తాం, రద్దు చేస్తాం అని బెదిరిస్తుంటే, మేము మీ దేశంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి, మాకు భరోసా ఏది అంటూ, కేంద్రం మత్న్రి, పీయూష్ గోయల్ ని నిలదీశారు అనే విషయం వార్తల్లో కూడా వచ్చింది. ఇదే విషయం పై, ప్రధాని నరేంద్ర మోడీ కూడా, మొన్న జగన్ ని కలిసిన సమయంలో, వివరణ కోరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

piyush 27022020 2

అయితే ఇప్పుడు మరోసారి కేంద్రం, విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, జగన్ ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జగన్ ప్రభుత్వం పై నేరుగా ఆరోపణలు చెయ్యకుండా, దక్షిణాదిన ఒక రాష్ట్రం అంటూ, అందరికీ అర్ధం అయ్యేలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఒక సదస్సులో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దక్షిణాదిన ఒక రాష్ట్రం తీసుకున్న పీపీఏల పునఃసమీక్ష వల్ల, దేశం పరువు కూడా పోతుంది అంటూ, పియూష్ గోయాల్ వ్యాఖ్యలు చేసారు. ఈ విషయంలో మీకు ఎవరైనా అక్కడ వాళ్ళు తెలిస్తే, మీరైనా వారికి, ఈ నష్టం గురించి చెప్పండి అంటూ, తన నిస్సహాయతను కూడా కేంద్ర మంత్రి వ్యక్తం చేసారు అంటే, ఇటు వైపు ఎంత మొండిగా ఉన్నారో, దాని వల్ల దేశం కూడా ఎలా నష్టపోతుంది అనేది అర్ధం అవుతుంది.

piyush 27022020 3

కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ దేశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చెయ్యాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఇలాగే ఒప్పందాలు సమీక్ష చేసి, పెట్టుబడి పెట్టే కంపెనీలను నష్ట పరిచే విధంగా చేస్తే, రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధులు, రిజర్వ్ బ్యాంక్ తో మాట్లాడి, ఆ నిధులు కట్ చేస్తాం అంటూ, పియూష్ గోయల్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఇలా పీపీఏల సమీక్షలు చేసుకుంటూ పొతే, దేశం పరువు కూడా పోతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి అంటూ, నిర్మోహమాటంగా కేంద్రమంత్రి చెప్పారు. పీపీఏ ల విషయంలో తప్పు చేసిన వారికి శిక్ష పడేలా ఉండాలని, కాని దేశం పరువు తీస్తే ఎలా అంటూ, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సెహ్సారు. సీఐఐ లాంటి సంస్థలు, ఈ సమస్య ఎలా పరిష్కారం చెయ్యాలో సూచనలు ఇవ్వాలి అంటూ కోరారు.

 

Advertisements