టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ప్రసంగాల్లో మధ్యలో చమత్కారాలు, ఛలోక్తులు విసురుతూ సభికులను బాగా నవ్విస్తున్నారు. తాజాగా రాజమండ్రి రోడ్ షోలో కూడా చంద్రబాబు జనసేనాని పవన్ కల్యాణ్ పై ఓవైపు విసుర్లు, మరోవైపు వ్యంగ్యం కురిపించారు. తాను లక్ష రూపాయలిచ్చి ఆడబిడ్డలను అత్తారింటికి పంపిస్తున్నానని చెప్పే క్రమంలో, పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమా తీశారని గుర్తుచేశారు. తాను అందరినీ అత్తారింటికి పంపిస్తుంటే, పవన్ కల్యాణ్ మాత్రం ఆయన దారి ఆయన వెతుక్కుంటూ వెళుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా, పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించారు. చంద్రబాబు సైకిల్ చెయిన్ ను కేసీఆర్ తెంపేశారని, ఇక సైకిల్ నడవడంలేదని పవన్ అనడం పట్ల తనదైన శైలిలో స్పందించారు.

viveka 3032019

తన సైకిల్ ను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. "నా సైకిల్ ను తాకితే షాక్ తింటారు, నా సైకిల్ తాకి నిలబడగలరా వీళ్లు? సైకిల్ నుంచి కూడా కరెంట్ తయారవుతుంది. అది మామూలు కరెంట్ కాదు. అంత స్పీడుగా వెళుతుంది నా సైకిల్ బుల్లెట్ మాదిరిగా. ఎవరైనా తాకితే అక్కడితో ఫినిష్! అలాంటి సైకిల్ చెయిన్ ను ఎవన్నా తెంపగలరా? వాళ్లను నేను వదిలిపెడతానా?" అంటూ నవ్వులు విరబూయించారు. జగన్‌ లోటస్‌పాండ్‌లోనే అభ్యర్థుల్ని ఎంపిక చేశాడని, మనల్ని మోసం చేయడానికి జగన్‌ ఏపీకి వస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేసీఆర్‌.. ఆంధ్రా వాళ్లు రాక్షసులు, కుక్కలు అన్నారని, కేసీఆర్‌ నోరు పారేసుకుంటే మనం పడాలా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ పై కూడా చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. మోదీకి కొడుకులు, కూతుళ్లు లేరు..ఎందుకు మాపై శాపనార్దాలు.. సెటైర్లు వేస్తారని చంద్రబాబు మండిపడ్డారు.

viveka 3032019

యుద్ధం హుందాగా ఉండాలని, దెబ్బ ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతా, అవసరమైతే ప్రాణం పోయినా పర్లేదని చంద్రబాబు అన్నారు. హోదా అడిగితే కేసీఆర్‌, జగన్‌తో కలిసి నాపై కక్ష తీర్చుకుంటారా? అని బాబు ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చిన వెనక్కి తీసుకున్నారని, ఇదేనా ప్రధాన మంత్రి ధర్మం అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన గాయాలు ఇంకా మానలేదు.. మోదీ వచ్చి కారం జల్లుతున్నారని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి ప్రధాన మంత్రి దేశానికి అవసరమా? అని చంద్రబాబు అన్నారు.

Advertisements