రెండు రోజుల క్రిందట, పవన్ కళ్యాణ్ సన్నిహితులు పై, వాళ్ళ కంపెనీల పై ఐటి దాడులు జరిగాయనే వార్తలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ, కేసీఆర్, బీజేపీ పై పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలతో, పవన్ ను లొంగదీసుకునే ప్రయత్నంలో భాగంగా, ఈ కుట్రలకు తెర తీసారు. దీని వెనుక విజయసాయి రెడ్డి స్కెచ్ ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే, ఇప్పుడు పవన్ పర్యటనను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కలయన్ హెలికాప్టర్ ఉపయోగించి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే నిన్న జగన్ సొంత ప్రాంతం కడపలో పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పవన్ కళ్యాణ్ కు హెలికాప్టర్ పెర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇంతక ముందు కూడా ఇలాగే చేసారని, అది సాంకేతిక పరమైన అంశం ఏమో అని వదిలేశామని, కాని ఇప్పుడు పదే పదే ఇలా చేస్తుంటే, కావలని చేస్తున్నారని అర్ధమవుతుందని అంటున్నారు.

pk 29032019

దీని పై పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా స్పందించారు. ‘నేను ఎవరితో మాట్లాడినా వారి భాగస్వామి అంటున్నారు. జగన్‌ అమిత్‌షాలే భాగస్వాములు. రాయలసీమలో అడుగు పెట్టకుండా చేసేందుకు అనేక కుట్రలు పన్నారు. నాకు ఇవాళ హెలికాప్టర్‌ అనుమతి రద్దు చేశారు. ఎందుకని ప్రశ్నిస్తే దిల్లీ నుంచి ఆదేశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి డైరెక్షన్‌ ఎవరు ఇస్తున్నారు. జగన్‌ ఇచ్చారా?.. భాజపా వాళ్లు ఇచ్చారా.. జగన్‌లా నేను డొంక తిరుగుడుగా చేయను. దొంగయవ్వారాలు చేయను’ అని జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కడప సభలో విరుచుకుపడ్డారు. ఈ రోజు సభకు హెలికాప్టర్‌లో రావాలనుకుంటే.. హెలికాప్టర్‌ పర్మిషన్‌ను రద్దుచేశారని, ఎక్కడి నుంచి డైరక్షన్‌ వచ్చిందో తెలియడంలేదన్నారు. జగన్‌ ఇచ్చారా? లేకపోతే భాజపా నేతలు ఇచ్చారో అర్థంకావడంలేదని పవన్‌ వ్యాఖ్యానించారు. జగన్‌లా తాను డొంకతిరుగుడు రాజకీయాలు చేయబోనని, రాయలసీమ పద్ధతిలో ముఖస్తుతి లేకుండా మాట్లాడగలని చెప్పారు.

pk 29032019

‘‘నేను రాజకీయాల్లోకి రాకముందు యాక్టర్‌ని. ఆ తర్వాతే అన్నీ తెలుసుకొని రాజకీయాల్లోకి వచ్చా. నీవు రాజకీయాల్లోకి రాక ముందే జైలులో ఉండి వచ్చావు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని’’ జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో ఏ పరిశ్రమ వచ్చినా స్థానికులకే 60 శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దరఖాస్తుల కోసం వసూలు చేసిన సొమ్ముతో నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల ఉద్యోగాలకు దరఖాస్తుకు ఒకేసారి రుసుం చెల్లిస్తే చాలన్నారు. ‘నేను ఓ పింఛను ఉద్యోగి కుమారుడిని. మా నాన్న పింఛను డబ్బులను మా అమ్మ పార్టీ కోసం ఇచ్చింది. సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానం కొనసాగించి ఉద్యోగులకు భద్రత కల్పిస్తాను. రాష్ట్రంలో లక్ష ఎకరాలు భూసేకరణ చేసి యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి మంచి రైతులుగా తీర్చిదిద్దుతాను. పదో తరగతి వరకు చదువుకున్న 25 వేల మందిని పోలీసు సహాయకులుగా ఉపాధి కల్పిస్తాం’ అని పవన్‌ తెలిపారు.

Advertisements