రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఎవరి దారి వారిది అన్నట్టుగా ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన పై, ఎవరికి వారు తమ తోచిన దారిలో వారు వెళ్తున్నారు. ఎక్కడా కలిసి ఉద్యమాలు చేయటం లేదు. ఇదే జగన్ మోహన్ రెడ్డికి బలంగా మారింది. ఇది ఇలా ఉంటే, మొన్న చంద్రబాబు కుప్పం పర్యటనలో, ఒక కార్యకర్త, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలని కోరగా, చంద్రబాబు స్పందిస్తూ, వన్ సైడ్ లవ్ నడవదు అని, అప్పటి వరకు మన పని మనం చేసుకుందాం అని చంద్రబాబు చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యల చర్చకు దారి తీసాయి. అయితే ఈ వ్యాఖ్యల పై ఈ రోజు పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో ఈ రోజు పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తుల పై నిర్ణయాన్ని అక్కడ వారు పవన్ కళ్యాణ్ కు అప్ప చెప్పగా, దానికి ఆయన ధన్యవాదాలు చెప్తూ, ఇప్పటికైతే మనం బీజేపీతో పొత్తులో ఉన్నాం అని అన్నారు. పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చు అని, రకరకాల మైండ్ గేం లు ఆడవచ్చు అని, కానీ ఈ పొత్తుల విషయంలో పార్టీ శ్రేణులందరూ ఒకేమాట మాట్లాడుదాం అని అన్నారు. పొత్తులు విషయం మీతో చర్చించే ఒక నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. ప్రస్తుతం  పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడదాం అని పవన్ అన్నారు.

Advertisements