ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేడు అరుదైన గౌరవం అందుకోబోతున్నారు. పోలవరం నిర్మాణంలో కీలకమైన గ్యాలరీ వాక్‌ను నేటి ఉదయం 10 గంటలకు ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం గ్యాలరీ వాక్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. గ్యాలరీ వాక్‌తో చంద్రబాబు సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ఇందిరాగాంధీ హయాంలో సాగర్ గ్యాలరీ పనులు పూర్తయ్యాయి.

cbn 12092018

ప్రధాని హోదాలో ఇందిర గ్యాలరీ వాక్ చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకే ఆ అదృష్టం దక్కింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావించారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ పోలవరం నిర్మాణంలో గ్యాలరీ వాక్‌ను చూశామన్న తృప్తి తమకు మిగులుతుందని పేర్కొన్నారు. కాగా, స్పిల్‌వే, స్పిల్ చానల్ నిర్మాణాల్లో వేగం పుంజుకుంటే గ్యాలరీ వాక్‌కు సందర్శకులను అనుమతించే అవకాశం ఉండదు. 2019 ఖరీఫ్‌ సీజన్‌ నాటికి పోలవరం పనులు పూర్తి చేస్తామని.. సమాంతరంగా కాఫర్‌ డ్యామ్‌లు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ల నిర్మాణాలు పూర్తిచేసి.. గోదావరి నదిని మళ్లిస్తామనే ధీమాను జల వనరుల శాఖ వ్యక్తం చేసింది. ఈ ధీమా బుధవారం ఒక రూపం తీసుకోనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్యాలరీ వాక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

cbn 12092018

బుధవారం ఉదయం 10.05 గంటలకు గ్యాలరీ వాక్‌కు ముహూర్తం నిర్ణయించారు. 20 నిమిషాలు ముందుగా, 9.45 గంటలకల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పోలవరం ప్రాం తానికి చేరుకోవాలని సీఎంవో మంగళవారంఆహ్వానాలు పంపింది. 48వ బ్లాక్‌లో సీఎం గ్యాలరీలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి 36వ బ్లాక్‌ వరకు నడుస్తారు. అక్కడనుంచి బయటకు వచ్చేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటుచేశారు. అటునుంచి ఆయన వెలుపలకు వచ్చి, నేరుగా బహిరంగసభా స్థలికి చేరుకొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించిన 5 వేల మందికిపైగా సందర్శకులతో ఆయన సమావేశమవుతారు. గ్యాలరీ లోపలి భాగాన స్టాండింగ్‌ ఏసీలను అమర్చా రు. ఆక్సిజన్‌ సిలిండర్లను సిద్ధం చేశారు. ఈ వాక్‌లో ఆయన వెంట మంత్రి నారా లోకేశ్‌, ఇతర కుటుంబసభ్యులు, స్పీకర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.

Advertisements