పవిత్ర సంగమంలో పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. పర్యాటకులు కొందరు సరదా పేరుతో సంగమం ఘాట్‌లలోకి దిగి ఈత కొడుతున్నారు. ఇటీవల కంచికచర్ల మిక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు గోదావరి ఘాట్‌లోకి దిగి గల్లంతై మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో సంగమంలో భద్రత చర్యలు లోపభూయిష్టంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రమాద సంఘటన తెలుసుకుని 6 గంటలకు పైగా ఘాట్‌లలో ఉండి పరిశీలించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి స్థానికులు పలు సమస్యలు తీసుకువచ్చారు.

sangamam 01072018 2

పవిత్ర సంగమంలో ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడం వల్ల పర్యాటకులు, విద్యార్థులు ఘాట్‌లలోకి దిగి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల బాలుర దగ్గర నుంచి ఇంజనీరింగ్‌ విద్యార్థుల వరకూ ఘాట్‌లలోకి సరదా కోసం దిగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారుల సమీక్షలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీస్‌ భద్రతపై ప్రధానంగా చర్చించారు.

sangamam 01072018 3

పవిత్ర సంగమం ఘాట్‌ పొడవునా ఇకపై ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లతో నిఘా ఉంచనున్నారు. ఘాట్‌లలోకి వెళ్లకుండా వీరు అప్రమత్తంగా ఉంటారు. 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో 15 మంది కానిస్టేబుల్స్‌ విధులు నిర్వహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఘాట్‌లలోకి దిగి ఈతకొట్టేందుకు అనుమతులు ఇచ్చే ప్రసక్తి లేకుండా ఆదేశాలు జారీ చేశారు. పిండ ప్రదానాలకు సైతం ముందస్తు అనుమతులు తీసుకోవాలనే నిబంధన పెట్టారు.

 

Advertisements