విశాఖపట్నంలో చంద్రబాబు గారి యాత్రకు పర్మిషన్ ఇచ్చి, ఎక్కవు సంఖ్యలో వైసీపీ అభిమానులు వచ్చేలా చేసి, వారిని అడ్డుకోకుండా చేసినందుకు, వారిని అరెస్ట్ చెయ్యకుండా, చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేసారు అంటూ, హైకోర్ట్ పోలీసులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనికి తోడుగా, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా, అక్కడ అడ్డుకున్న వైసీపీ నాయకుల ఫోటోలు మీడియాకు విడుదల చేసారు. ఇవే ఫోటోలు, వీడియోలు కోర్ట్ కు కూడా ఇవ్వటానికి సిద్ధం అయ్యారు. దీంతో, పోలీసులకు, ఇక తప్పని పరిస్థితి. రెండో తారీఖు వాయిదా ఉండటంతో, ఈ రోజు, అంటే సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత, వైసీపీ వారిని అరెస్ట్ చేసారు. 32 మంది వైసీపీ కార్యకర్తలతో పాటుగా, 20 మంది టీడీపీ కార్యకర్తల పై కూడా కేసు పెట్టారు. అలాగే ఎయిర్‌పోర్టు దగ్గర ఆ-త్మ-హ-త్య-కు ప్రయత్నం చేసిన రామారావు పై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఎస్‌ఐ పై దాడి చేసిన వైసీపీ మహిళా నేత కృపాజ్యోతిపైనా కేసు నమోదు చేసి, ఆమెను కూడా అరెస్ట్ చేసారు.

court 29022020 2

మరో పక్క తెలుగుదేశం నేతలు, జరిగిన ఘటన పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏపీలోనే కాదు దేశంలో అభివృద్ధి చంద్రబాబుకు మరోపేరుగా కీర్తి గడించారని, అరాచకమే జగన్ కు మారుపేరుగా చెడ్డపేరు తెచ్చుకున్నారని తెదేపా నేతలు అయ్యన్న పాత్రుడు, నిమ్మల రామానాయుడు విమర్శించారు. 9 నెలల పాలనలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే ప్రజాదరణమిన్నగా ఉన్న చంద్రబాబు పర్యటనకు జగన్ ఈర్ష్యతో అడ్డంకులు సృష్టించడం తగదని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకు తగిన రక్షణ కల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అరాచాకావాదులను మంత్రులు ప్రోత్సహించి పంపినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం జగన్ ఫ్యాక్షనిస్టు మనస్తత్వానికి నిదర్శమని దుయ్యబట్టారు. అభివృద్ధికి చంద్రబాబు కేరాఫ్ అడ్రసయితే అరాచాకవాదులకు అడ్డగా వైకాపాను పోషించడం జగన్ హేయమైన చర్య అన్నారు. బాధితులపైనే కేసులు పెట్టడం వైకాపా ప్రభుత్వ నైజం మారిందని అనేక సంఘటనలు ఉదహరించారు. అమరావతికి మద్దతు పలకమని కోరిన రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన చరిత్ర వైకాపా ఎంపీ నందిగం సురేష్ దని ఆక్షేపించారు. విశాఖలో పర్యటనకు అనుమతి తీసుకుని వెళ్ళిన చంద్రబాబును అడ్డుకోవడమే కాకుండా ఆయనపై 151 కింద అరెస్ట్ చేయడమేమిటని ప్రశ్నించారు.

court 29022020 3

విశాఖలో చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డుపడి అల్లరులు సృష్టించి ఏపీని బీహార్ కంటే ఘోరంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రాష్ట్రంగా మార్చాలని జగన్ ప్రయత్నిచడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజల్లో నిర్భయంగా పర్యటన జరిపే సత్తా , దమ్ముకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అన్నారు. ఎవరు అడ్డుకున్నా త్వరలోనే విశాఖలో చంద్రబాబు పర్యటన జరిపి తీరుతారని సవాల్ విసిరారు. అధికారమదంతో చేసిన తప్పులకు ముఖం చూపించలేక తెర చాపల వలల మధ్య జగన్ పలాయనవాదానికి నిదర్శనం ఎద్దేవా చేశారు.
ఏపీ అభివృద్ధికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిద్రాహారాలుమాని కృషి చేస్తే జగన్ రాష్ట్ర విధ్వంసానికి పాల్పడుతున్నాడని అయ్యన్న పాత్రుడు, నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలపై పోరాడేందుకు చంద్రబాబు పర్యటనకు పూనుకుంటే సహించలేని జగన్ పోలీసులతో అరాచకానికి సిద్ధపడటం హేయమైన చర్యని విమర్శించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి రోజుకు18 గంటలపాటు చంద్రబాబు పని చేసి అనేక పరిశ్రమలు నెలకొనేలా చేశారన్నారు.

గత 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 5 లక్షల ఉద్యోగాలు తెచ్చి పెట్టిన ఘనత చంద్రబాబుదని గుర్తు చేశారు.ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తిని నమ్మి జగన్ కు అధికారం ఇచ్చి బంగారు గుడ్డు పెట్టె బాతును చంపుకున్నామని ప్రజలు ఆవేదన భరితులవుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని రకాల వైఫల్యాలకు కారణమై ప్రజల్లో తిరగలేని దుస్థితికి జగన్ సిగ్గు పడాలన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం చంద్రబాబు తత్వమని, ప్రజలకు కష్టాలు, ఇబ్బందులు సృష్టించడం జగన్ నైజమని విమర్శించారు. నాడు తండ్రి వైఎస్ అప్పటి ముఖ్యమంత్రులను మార్చడానికి హైదరాబాద్ లో మతకలహాలకు ఆజ్యం పోశాడు... నేడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న ప్రజాస్పందనను తట్టుకోలేక ఆయన పర్యటనను అడ్డుకోడానికి జగన్ పోలీసులతోనే అల్లర్లు, అశాంతికి కారణమవడం ప్రజలు చేసుకున్న దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతికాముకులైన విశాఖ ప్రజలకు వైసీపీ ఫ్యాక్షన్ రుచి చూపించడం సహించరాని నేరమని విమర్శించారు.

Advertisements