క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మే 14న ధర్మాసనం ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పోలీసుల దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు విచారణకు కూడా కోటం శ్రీధర్‌రెడ్డి సహకరించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యేపై 173, 174 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధర్మాసనం ముందు హాజరుకావాలని ఆదేశించింది... ఈ విషయం పై నెల్లూరు పోలీసులు పత్రికా ప్రకటన ఇచ్చారు.. ఇదే ఆ ప్రకటన...

nellore 25042018 1

"నెల్లూరు నగర 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అయిన కృష్ణ సింగ్, బుకీలు, పంటర్ల పై Sec.3 A.P Gaming Act మరియు Sec.109 IPC క్రింద కేసు నమోదు చేయటం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో నెల్లూరు రూరల్ MLA అయిన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అయిన కృష్ణ సింగ్ మరియు బుకీలు, పంటర్లను ప్రోత్సహిస్తూ, వారికి సహకరిస్తున్నట్లు వారితో లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తగు ఆధారాలు సేకరించడం జరిగింది. సేకరించిన ఆదారాల ఆధారంగా సదరు MLA గారికి దర్యాప్తు అధికారి Sec.41 Cr.P.C ప్రకారం సంజాయిషీ ఇచ్చుకొనుటకు నోటీసు ఇవ్వటం జరిగింది. MLA గారు నోటీసు తీసుకొని దర్యాప్తు అధికారి వద్ద హాజరు కాలేదు. సదరు MLA గారు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి " నేను దర్యాప్తు అధికారుల వద్ద హాజరుకాను. వారి ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టుకోండి " అని తెలియచేయడం జరిగింది. దర్యాప్తు అధికారి 2వ సారి నోటీసు ఇవ్వటానికి ప్రయత్నించగా నోటీసును MLA గారు నిరాకరించటం జరిగింది.

nellore 25042018 1

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ, క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన కృష్ణ సింగ్ మరియు బుకీలు, పంటర్ల పై ఆధారాలు సేకరించిన తర్వాత వారిపై Sec.3 of AP. Gaming Act క్రింది మరియు వారిని ప్రోత్సహిస్తూ, వారికి సహకరిస్తూ వారితో లావదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు ఉన్నందు వలన MLA శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై Sec.3 of AP Gaming Act, Sec. 109 IPC క్రింద, మరియు నోటీసు తీసుకొని హాజరు కానందుకు, నోటీసు నిరాకరించినందుకు Sec.173, 174 IPC క్రింద నేరాలు రుజువు అయినందున ది.23.04.18 న సంభందిత కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయటమయినది. సదరు కోర్ట్ మే నెల 14 వ తేదీన కోర్టులో హాజరు కావలసినదిగా రూరల్ MLA శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మరియు ఇతర ముద్దాయిలకు సమన్లు జారీ చేయటం జరిగినది. రూరల్ MLA శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి క్రికెట్ బుకీల తోను మరియు పంటర్ల తోను జరిపిన ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ACB వారికి సమర్పించటం జరుగుతుంది. ఈ లావాదేవీలపై తదుపరి దర్యాప్తు ACB వారు నిర్వహిస్తారు. జిల్లాలో క్రికెట్ బూకీలపై, నిర్వాహకులపై మరియు Gutka అమ్మకందారుల పై మరియు సరఫరా దారుల పైన కఠిన చర్యలు తీసుకోబడుతాయి. సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, నెల్లూరు"

Advertisements