ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కుమార్ తల్లిదండ్రులకు  ఏపి పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఆయన తల్లిదండ్రులు ఇంటికి విజయవాడ పోలీసులు ఈ రోజు వెళ్లారు. కొండాపూర్‍లోని పీవీ రమేష్ తండ్రి నివాసానికి ముగ్గురు ఆంధ్రప్రదేశ్ పోలీసుల బృందం వచ్చింది. ఓ కేసు విచారణలో భాగంగా ఏ ఈనెల 22న విచారణకు రావాలని నోటీసులు అందజేసారు. అయితే రమేష్‍కుమార్ తల్లిదండ్రుల వయసు 80 ఏళ్ళపైనే ఉండి. వృద్ధులైన రమేష్ తల్లిదండ్రులను పోలీసులు కావాలాని వేధిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.  పీవీ రమేష్ కుమార్ తల్లిదండ్రులు ఈ విషయం పై స్పందించారు. గతంలో సిఐది చీఫ్ సునీల్ కుమార్ కు, తమకు విబేధాలు ఉన్నాయని, తమ కూతురు భర్త అయిన సునీల్ కుమార్ పై గృహ హింస కేసు పెట్టామని, అది దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు తమ పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. తమను ఈ వయసులో ఏడిపించటం భావ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం పై పీవీ రమేష్ స్పందించాల్సి ఉంది.

Advertisements