30 ఇయర్స్ పృథ్వీ మళ్ళీ హర్ట్ అయ్యారు. ఈ మధ్య రాజకీయంగా పృధ్వీ బాగా ఆక్టివ్ అవుతూ, రాజకీయాల వైపే మాట్లాడుతూ వార్తల్లో నిలిస్తున్నారు. అయితే ఇప్పుడు సినిమా పరంగా, మళ్ళీ హర్ట్ అయ్యి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పదవి అంటే రాజకీయంగా జగన్ ఇచ్చిన, ఎస్వీబీసీ చైర్మెన్ పదవి కాదు, సినిమా వ్యక్తిగా సంపాదించుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవి. ఈ రోజు ఉదయం నుంచి టాలీవుడ్ లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మధ్య గొడవ, తీవ్ర వివాదానికి కారణం అయ్యింది. ఈ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అత్యవసర సమావేశం అంటూ ఏర్పాటు చేసారు. అయితే ఈ సమావేశంలో కొంత మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ నిరసన తెలుపుతూ, వాక్ అవుట్ చేసారు. ఈ సమావేశానికి 30 ఇయర్స్ పృథ్వీ కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశం జరిగిన తీరు పై ఆయన భగ్గు మన్నారు.

prudhvi 20102019 2

ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ తనకు ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదని, ఈ పదవికి రాజీనామా చేస్తున్నాని సంచలన ప్రకటన చేశారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరి గోపాలకృష్ణకు ఈ రోజు అవమానం జరిగిందని, పరుచూరి కంటతడి పెడుతూ సమావేశం నుంచి వెళ్లిపోయారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడిగా గెలిచినందుకు ఆనందపడాలో, ఈ గొడవలకు బాధపడాలో తెలియడం లేదన్నారు. సమావేశం ఉందంటే, తిరుపతి నుంచి వచ్చానని, ఇక్కడ రచ్చ రచ్చ చేస్తున్నారని అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఫీలవుతున్నారని, ఎవరికి వారు గ్రూపులు పెట్టుకున్నారని పృథ్వీ ఆరోపించారు.

prudhvi 20102019 3

అయితే ఈ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స‌మావేశం అనగానే రచ్చ మొదలైంది. గౌర‌వ స‌ల‌హాదారు హోదాలో కృష్ణంరాజు మా స‌భ్యుల మ‌నోగ‌తం ఏంటో తెలుసుకోటానికి ఈ స‌మావేశం అని చెప్పారు. అయితే దీని వెనుక జీవితా రాజశేఖర్ ఉన్నారని తెలుసుకుని, న‌రేశ్‌, రాజ‌శేఖ‌ర్ వ‌ర్గాల మ‌ధ్య మాట‌ల యుద్ధంతో స‌మావేశం వాడి వేడిగా సాగింది. మా అధ్యక్షుడు నరేష్‌ లేకుండానే రాజశేఖర్‌, జీవితలు జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించటం పై అభ్యంతరం తెలిపారు. అత్యవసర సమావేశం అని సభ్యులకు మెసేజ్‌ చేయటంలో అంతా హజరయ్యారు. అయితే ఈ మీటింగ్‌ పై మా అధ్యక్షుడు నరేష్‌కు మాత్రం సమాచారం లేదు. అయితే నరేష్ తరుపు లయార్, అధ్యక్షుడికి తెలియకుండా మీటింగ్‌ ఎలా నిర్వహిస్తారంటూ జీవిత రాజశేఖర్‌లను ప్రశ్నించాడు. దీని పై స్పదించిన రాజశేఖర్‌, జీవితలు ఇది ఫ్రెండ్లీ మీటింగ్‌ మాత్రమే అని అన్నారు.

Advertisements