వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు క్యాష్.. క్యాస్ట్.. మాత్రమే కావాలని, మరేవీ పట్టవన్నారు. క్యాష్ బ్యాడ్ అవుతే.. క్యాస్ట్ ఉండాలని.. అది కూడా నచ్చకపోతే, ఎవరు బెటర్ అయితే వాళ్లను నియమించుకుంటూ వెళ్లిపోయారని చెప్పారు. వైసీపీ నుంచి తాను బయటకు వచ్చానని కొంత మంది భావిస్తున్నారని, ఒకరకంగా మెడ పట్టుకొని బయటకు తోసేశారని చెప్పారు. గతంలో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తనను, తర్వాత సెంట్రల్ నియోజకవర్గానికి వెళ్లమని జగన్ చెప్పారని రాధా గుర్తు చేశారు. జగన్ చెప్పిన వైపే వెళ్లి పని మొదలు పెట్టాక.. చివరి నిమిషంలో అర్ధం లేని కారణాలతో బయటకు వెళ్లిపోయేలా చేశారని రాధా ఆరోపించారు.

gannvaarma 22022019

వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కృష్ణా జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన రాధారంగా మిత్రమండలి సభ్యులతో వంగవీటి రాధా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాధా వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే టీడీపీ నేతలు ఆయనతో టచ్‌లోకి వచ్చారు. బుద్దా వెంకన్న సహా పలువురు నేతలు రాధా టీడీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని ప్రకటించారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మద్దతుదారులు సైతం ప్రస్తుత పరిస్ధితుల్లో టీడీపీలో చేరితేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాధా టీడీపీలో చేర తారంటూ గత నెలలోనే ప్రచారం జరిగిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మరో ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్‌ రాధా ఇంటికి వెళ్లి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

gannvaarma 22022019

తన అనుచరులు, మద్దతుదారులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని టీడీపీ నాయకు లకు చెప్పడంతో రాధా టీడీపీలో చేరడం ఖాయమైపోయిందంటూ ప్రచారం జరిగింది. ఆ మర్నాడు రాధా విలేకరుల సమావేశం నిర్వహించి తాను వైసీపీకి రాజీనామా చేయడానికి దారి తీసిన కారణాలను వివరించారు. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. తాజాగా వంగవీటి రాధా తన అనుచరగణంతో కలిసి టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారంటూ మళ్లీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపధ్యంలో రాధా తాజాగా, జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాధా త్వరలోనే మంచి రోజు చూసుకుకి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

Advertisements