వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంతో, రోజు రోజుకీ జగన్ కు అసహనం పెరిగిపోతుంది. శనివారం జరిగిన వైసిపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో, ప్రాధాని మోడీని కాని, ఇతర కేంద్ర మంత్రులను కాని, మీరు డైరెక్ట్ గా కలవద్దు, ముందుగా విజయసాయి రెడ్డికి కాని, మిథున్ రెడ్డికి కాని చెప్పి, వారి సలహా తీసుకున్న తరువాత, వారి సమక్షంలోనే కలవాలి అని జగన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. పార్టీ లైన్ దాటవద్దని, చెప్పినట్టు వినకపోతే షోకాజ్ నోటీస్ ఇస్తాం అంటూ ఏకంగా జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరూ, ఆయన మాట దాటరు. కాని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో మాత్రం, యాదృచికంగా జరుగుతుందో, లేక అలా జరుగుతున్నాయో కాని, జరుగుతున్న పరిణామాలు మాత్రం, జగన్ మోహన్ రెడ్డిని, తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఏదో జరుగుతుంది అని ఆయన ఆలోచనలకు, ఇవి బలం చేకురుస్తున్నాయి.

raghu 21112019 2

ప్రధాని మోడీని డైరెక్ట్ గా కలవద్దు అని జగన్ చెప్పిన, వారం రోజులకే, పార్లమెంటు సెంట్రల్ హాల్లో, రఘురామకృష్ణంరాజు, ప్రధాని మోడీని కలిసారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో, మోడీని చూడగానే, రఘురామకృష్ణంరాజు నమస్తే సార్ అంటూ ప్రధానిని పలకరించారు. సెక్యూరిటీ మధ్యలోకి రఘురామకృష్ణంరాజును మోడి దగ్గరకు పిలిచారు. దగ్గరకు వెళ్ళిన రఘురామకృష్ణంరాజు, ప్రధాని మోడీకి పాదాభివందనం చేశారు. దీంతో ప్రధాని, రాజు గారు బాగున్నారా అంటూ, నవ్వుతూ ఆప్యాయంగా భుజం తట్టి మాటలు కలిపారు. తరువాత, ప్రధాని మోడీ తన చాంబర్‌కు వెళ్లిపోయారు. ఆ సమయంలో, కృష్ణంరాజు వెంట ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు.

raghu 21112019 3

అయితే ఈ పరిణామంతో, ఒక్కసారిగా వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రఘురామకృష్ణంరాజు వర్గీయలు మాత్రం, దీంట్లో ఏమి లేదని, ఎదురు పడితే పలకరించారని అన్నారు. అయితే రెండు రోజుల క్రితం పార్లమెంట్ మొదలైన మొదటి రోజే, రఘురామకృష్ణంరాజు, తెలుగు పరిరక్షణ గురించి, కేంద్రాన్ని అడగటం, వైసిపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, ఇంగ్లీష్ మీడియం పై ముందుకు వెళ్తుంటే, సొంత పార్టీ ఎంపీ చర్యతో ఇబ్బంది అని పార్టీ వర్గాలు భావించాయి. అయితే, ఈ విషయం పై జగన్ కూడా సీరియస్ అయ్యారని, రఘురామకృష్ణంరాజు నుంచి వివరణ కోరారని వార్తలు వచ్చాయి. వారం రోజుల్లోనే, గీత దాట వద్దు అని వార్నింగ్ ఇవ్వటం, తెలుగు భాష పై రఘురామకృష్ణంరాజు ప్రశ్న అడగటం, ఇప్పుడు ప్రధాని మోడీతో పలకరింపులు, ఇవన్నీ చూస్తుంటే, ఏదో జరుగుతుంది అని విశ్లేషకులు అంటున్నారు.

Advertisements