ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ, ఆందోళనలు జరుగుతున్నాయి. ఎందరో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను, ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, ఈ విషయం పై బుకాయిస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. బీజేపీ అయితే, అసలు మేము విశాఖ ఉక్కు పరిశ్రమ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాష్ట్రంలో తమ ఎదుగుదల చూసి, తెలుగుదేశం, కమ్యూనిస్ట్ లు ఇలా కుట్ర పన్నారు అంటూ వాపోయారు. ఇక వైసీపీ అయితే, పోస్కో కంపెనీ గురించి వస్తున్న వార్తలు అన్నీ అబద్ధం అని కొట్టి పారేసింది. ఏకంగా జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం పై స్పందిస్తూ, చంద్రబాబు కుట్ర పన్నారని, అసలు పోస్కోకి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధం లేదని, నేను వారిని కలిసింది, వేరే చోట స్టీల్ ప్లాంట్ పెట్టటానికి అంటూ, చెప్పుకొచ్చారు. అయితే, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ కానీ అబద్ధం చెప్తున్నారని, ఆర్టిఐ ద్వారా బట్టబయలు అయ్యింది. ఈ ఆర్టిఐ ప్రకారం, నాన్ - బైండింగ్ ఎంఓయి ఎప్పుడో జరిగిపోయింది. కొరియా కంపెనీ పోస్కో, అలాగే ఆర్ఐఎన్ఎల్ మధ్య అక్టోబర్ 23, 2019నే ఎంఓయు కుదిరిందని, ఆ ఆర్టిఐలో రిప్లై వచ్చింది.

posco 02032021 2

కొరియా కంపెనీ పోస్కో, అలాగే ఆర్ఐఎన్ఎల్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఒక జాయింట్ వెంచర్ కంపెనీ స్థాపించి, విశాఖలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తారు. ఈ ప్లాంట్ క్యాపసిటి, ఏడు నుంచి పది మిలియన్ టన్నుల వరకు, ఒక ఏడాదికి ఉంటుంది. ఈ ఆర్టిఐ రిప్లై ఇచ్చింది, కేంద్ర ఉక్కు పరిశ్రమ మంత్రిత్వ శాఖ. అలాగే ఈ ఎంఓయు ప్రకారం, కాయిల్స్, ప్లేట్స్, ఆయిల్డ్ కాయిల్స్, కోల్డ్ రోల్డ్ కాయిల్స్ తాయారు చేస్తారు. అలాగే ఈ ఒప్పందం ప్రకారం, ప్రస్తుతానికి పోస్కో కంపెనీకి 1167 ఎకరాల భూమి కేటాయిస్తారు. అయితే ఈ ఒప్పందంలో ఉన్న మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, కొరియా కంపెనీ పోస్కో, అలాగే ఆర్ఐఎన్ఎల్ కు, ఈ జాయింగ్ వెంచర్ లో, మూడో పార్టీని కూడా చేర్చుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ మూడో పార్టీ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. అయితే ఇంత స్పష్టంగా, విశాఖలో స్టీల్ ప్లాంట్ పై, కొరియా కంపెనీ పోస్కో, అలాగే ఆర్ఐఎన్ఎల్ మధ్య అక్టోబర్ 2019లోనే ఒప్పందాలు కూడా జరిగిపోతే, ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీకి తెలియకుండా ఉంటాయా ? మరి ఎందుకు ప్రజలను మభ్య పెడుతున్నారు ?

Advertisements