యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఈ రోజు మినీ రాజధాని రచ్చబండలో, జగన్ వైఖరిని ఎండగట్టారు. ముఖ్యంగా మన తెలుగు వారు అయిన, జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అవ్వటం, అంతకు ముందు జగన్ చేసిన పనులు, ఇప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ అయిన తరువాత, జగన్ నడుపుతున్న రాయబారాల గురించి బాంబు పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లుగా అరాచక పాలనతో, ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కానీ ఇప్పుడు సీన్ మారిందని, రఘురామ రాజు అన్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా మన తెలుగు బిడ్డ వచ్చారని, జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని, అప్పటి సుప్రీం కోర్టు జస్టిస్ గా ఉన్న ఎన్వీ రమణ ప్రభావితం చేసారని, ఆయన పై చర్యలు తీసుకోవాలని న్యాయ నిపుణులు కోరుతున్నారు అంటూ, జగన్ మోహన్ రెడ్డి సాక్షిలో ఒక బోగస్ ప్రచారం చేసారని, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారని అన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అవ్వకుండా, జగన్ చేయని ప్రయత్నం లేదని, చివరకు విఫలం అయ్యారని అన్నారు. ఇలాంటి వ్యవహారాలకు జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీలో తన బ్రోకర్లని పెట్టారని, వాళ్ళు రేపే మోడీని దించేయలని జగన్ మోహన్ రెడ్డి కోరితే, దించేస్తాం అని చెప్పంత గొప్ప వాళ్ళని అన్నారు.

nvramana 25042021 2

జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో కూడా అదే జరిగిందని అన్నారు. మీరు ఫిర్యాదు ఇవ్వండి చాలు, రమణ చీఫ్ జస్టిస్ అవ్వకుండా మేము చేసుకుంటాం అని వాళ్ళు చెప్పటం, జగన్ మోహన్ రెడ్డి గుడ్డిగా వెళ్ళటం వల్లే ఇదంతా జరిగిందని అన్నారు. ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసుల విషయంలో, జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాలు ఇచ్చిన తరువాత, న్యాయ వ్యవస్థనే భయబ్రాంతులకు గురి చేసేలా జగన్ వ్యవాహరించారని అన్నారు. అయితే ఇప్పుడు తన ప్రయత్నాలు అన్నీ తారు మారు అయ్యాయని, జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అవ్వటంతో, జగన్ మోహన్ రెడ్డి అనూహ్య చర్యలకు దిగారని అన్నారు. తన సొంత బాబాయ్ , టిటిడి చైర్మెన్ వైవి సుబ్బారెడ్డిని, ఆశీస్సుల సాకుతో, రాయబారానికి పంపించారని అన్నారు. ఈ తిరుమల బ్యాచ్ ఎవరికీ చిడతల కొట్టమంటే వారికి కొడతారని, మూడు నెలలు క్రిందట రమణ గారు తిరుమల వస్తే, ప్రోటోకాల్ పాటించని వారు, ఇప్పుడు వెళ్లి రాయబారం నడుపుతున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

Advertisements