నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుపై ప్రభుత్వ కక్ష సాధింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆయన పై రాజద్రోహం కేసు పెట్టి, సిఐడితో టార్చర్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆ కేసు సాగుతూనే ఉంది. తాజాగా ఎనిమిది నెలలు తరువాత, రఘురామరాజుని మళ్ళీ విచారణకు రావాలి అంటూ నోటీసులు ఇచ్చింది సిఐడి. అయితే ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన రఘురామరాజు, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పై ధ్వజమెత్తారు. పండగ రోజు ఎలా విచారణకు పిలుస్తారు అంటుంటే, అసలు నన్ను కొట్టిన వాడి పైన సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంటే, అతనే నన్ను మళ్ళీ ఎలా విచారణకు పిలుస్తారని ప్రశ్నించారు. అంతే, ఈ వ్యాఖ్యలు ఆధారమగా, ఆయన పైన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‍ను అసభ్య పదజాలంతో దూషించారు అంటూ, చింతలపూడికి చెందిన ఎయిమ్ సంస్థ సభ్యుడు గొంది రాజు ఫిర్యాదు చేసారు. ఇదే చింతలపూడి ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సొంత గ్రామ౦. దీంతో రఘురామరాజు పైన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. మరి దీని పైన రఘురామరాజుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చూడాలి మరి.

Advertisements