మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పటికే దాదాపు 5వేల కోట్ల రూపాయల మేర పీకల్లోతు నష్టాలతో ఉన్న ఆర్టీసీ పై అదనపు భారం పడింది. ఇటీవలే నామమాత్రంగా టిక్కెట్ చార్జీ పెంచినప్పటికీ పెరిగే వడ్డీల భారంతో నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సారిగా డీజిల్ పై లీటరు రూ. 1.07 పైసలు వ్యాట్ చార్జీ పెంచింది. రాష్ట్రంలో అత్యధి కంగా డీజిల్ వినియోగంలో మొదటి నుంచి ఏపీ ఎస్ ఆర్టీసీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల బస్సులు ఉండగా నెలకు సగటున 30కోట్ల లీటర్ల డీజిల్ ని వినియోగిస్తున్నాయి. తాజాగా లీటర్‌కు రూ. 1.07 పైసలు పెరిగిందంటే నెలకు రూ. 32 కోట్లు, సంవత్సరానికి దాదాపు రూ. 400 కోట్లు అదనపు భారం పడినట్లయింది. ఇప్ప టికే రాష్ట్రంలో ప్రభుత్వం 2 రూపాయలు అదనంగా అంటే 22.25 శాతంపై రూ. 24.25 పైసలు మేర వ్యాట్ వసూలు చేయటం ప్రారంభించింది. అలాగే పెట్రోలు లీటర్ 31శాతంపై రెండు రూపాయలు అదనంగా మొత్తం రూ.38 వ్యాట్ వసూలు చేయటం ఆరంభించింది.

rtc 02022020 2

అయితే పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం రెండు రూపాయలు తగ్గించడంతో వాహన యజమానులు సరిహద్దులోని తెలంగాణ పెట్రోలు బంక్ లతో ఫుల్ ట్యాంకు నింపుకోవటం ప్రారంభించారు. తాజాగా డీజిలపై రూ. 1.07 పైసలు, పెట్రోల్ పై 76 పైసలు వడ్డన జరిగింది. గతంలో డీజిల్ ధర పెరిగినప్పుడల్లా ఆర్టీసీ కార్మిక సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేసేవి. అయితే ప్రభుత్వంలో విలీనం కావటం, పైగా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వీసు రూల్స్ వర్తించడంతో ఏఒక్కరూ రోడ్డెక్కే వీలులేదు. దీంతో పెరిగిన డీజిల్ ధరపై ఆందోళన చేసేవారు కనిపించడం లేదు. ఇక కృష్ణాజిల్లానే అధికంగా ఆర్టీసీ బస్సులున్నాయి. జిల్లాలో 1432 బస్సులున్నాయి. ప్రతిరోజు ఈ బస్సులు ఐదు లక్షల కి.మీ చొప్పున నడుస్తాయి. పెరిగిన 1.07 పైసల వ్యా ట్ నెలకు కోటీ 60లక్షలు చొప్పున సాలీనా రూ. 19.21 కోట్ల మేర భారం పడనుంది.

rtc 02022020 3

జిల్లాలో ఇతర వినియోగ దారులందరిపై కలిసి రూ. 117 కోట్ల మేర భారం పడింది. జిల్లావ్యాప్తంగా 250 పెట్రోలు, డీజిల్ బంకులున్నాయి. ప్రతి బంకులో సగటున రోజుకు 3వేల లీటర్ల పెట్రోలు, 8వేల లీటర్ల డీజిల్ విని యోగం జరుగుతుంది. పెరిగిన చార్జీలను మొత్తం 250 బంకులపై రోజుకు పెట్రోలు వినియోగదారులు రూ. 5.70 లక్షల లెక్కన నెలకు రూ. 1.71కోట్లు, ఏడాదికి రూ. 20.52 కోట్లు భారం పడుతుంది. అదే డీజిల్ వినియోగదానికి వస్తే సగటున బంకుల్లో రోజుకు 8వేల లీటర్ల వినియోగం జరుగుతుంది. దీనివల్ల రోజుకు రూ. 21.40 లక్షల చొప్పున నెలకు రూ. 6.42 కోట్లు సాలీనా రూ. 77.10 కోట్ల భారం పడుతోంది. ఒక్క నెల రోజుల్లో, రెండు సార్లు డీజిల్ రెట్లు పెంచటంతో, ఆర్టీసీ షాక్ అయ్యింది. మొదటి సారి డీజిల్ రేట్లు పెంచాగానే ఆర్టీసీ చార్జీలు పెంచారు. అయితే, ఇప్పుడ నెల రోజుల్లోనే రెండో సారి పెంచటంతో, ఆర్టీసీకి ఈ నష్టం ఎలా బర్తీ చేసుకోవాలో అర్ధం కావటం లేదు.

Advertisements