ఎద్దు ఈనింది అంటే దూడను గాట్లో కట్టేయండి అన్నట్లుగా తయారైంది వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం. ఏమి లేనిది ఉన్నట్టు చెప్తూ, ప్రచారం చేసి ప్రజలను నిజం అని నమ్మించేస్తూ ఉంటారు. దీనికి మొన్నటి శేఖర్ రెడ్డి ఉదంతమే ఉదాహరణ. శేఖర్ రెడ్డి, చంద్రబాబు బినామీ అంటూ ప్రజలని నమ్మించేశారు. తీరా జగన్ అధికారంలోకి రాగానే, ఎబ్బే అదేమీ లేదు, అంతా తూచ్, శేఖర్ రెడ్డి నిజాయతీ పరుడు అంటూ, టిటిడి బోర్డు మెంబర్ పదవి ఇచ్చారు. అలాగే పింక్ డైమండ్ వ్యవహారంతో పాటుగా, అనేక అనేక కధనాలు ఇలాగే అల్లి, నిజం అని నమ్మించారు. అయితే, ఏమి లేకపోతేనే నిజం అని నమ్మించేసే వైసిపీ ప్రచారకర్తలకు, నిజంగానే ఒక చిన్న ఆధారం దొరికితే, ఇక వారి కధనాలకు అంతే ఉండదు. అలాంటి సంఘటనే, తాజాగా హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం అయ్యింది, విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫోటో.

kesineni 18102019 2

విజయసాయి రెడ్డితో కేశినేని నాని కలిసి ఉన్న ఫోటో, ఉదయం నుంచి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇదే అదనుగా, కొంత మంది వైసీపీ అభిమానులు, ఇంకేముంది, కేశినేని నాని మా పార్టీలోకి వచ్చేస్తున్నారు, విజయసాయి రెడ్డి రాయబారం నడిపారు అంటూ, పోస్ట్ లు పెట్టటం మొదలు పెట్టరు. కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానెల్స్ లో కూడా ఈ ఫోటో ప్రత్యక్షం అవ్వటంతో, ఈ ప్రచారం నిజమే అని నమ్మే స్థాయిలోకి వ్యవహారం వెళ్ళింది. అయితే అసలు జరిగిన విషయం మాత్రం వేరు. నిన్న రాత్రి డిల్లీ - విజయవాడ ఫ్లయిట్ మూడు గంటలు లేటవటంతో లాంజ్ లో కేశినేని నాని రిలాక్స్ అవుతున్నారు. ఇంతలో విజయసాయి రెడ్డి వచ్చి కేశినేని పక్కన కూర్చుని మర్యాదపూర్వకంగా మాట్లాడారు.

kesineni 18102019 3

ఈలోపు అక్కడ ఉన్న కొంత మంది కేశినేని నాని, విజయసాయి రెడ్డి పక్క పక్కన కూర్చోవటంతో, ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఆ ఫోటో తీసే సమయంలో కూడా, కేశినేని నాని చాలా ఇబ్బందిగా ఉండటం గమనించ వచ్చు. అయితే, సాయంత్రం అయ్యే సరికి, ఈ ఫోటోను రకరకాల వార్తలతో వండి వార్చుతున్నారు.  పార్టీ మారనని అందరికీ కేశినేని క్లారిఫికేషన్ ఇచ్చుకోవలసి వస్తుంది అంటూ కొన్ని ఛానెల్స్ కూడా ప్రసారం చేసాయి. అయితే కేశినేని నాని వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు మాత్రం, సందర్భం వచ్చిన ప్రతిసారి, ట్విట్టర్ లో, వైసీపీని, వన్ లైన్ పంచ్ లతో, కౌంటర్ లు ఇస్తున్న నాని పార్టీ మారటం ఏంటి అని అంటున్నారు. కేవలం వైసీపీ తనను టార్గెట్ చేస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తుందని, ఆ ఆరోపణలకు కూడా అవకాశం ఇవ్వకుండా ట్రావెల్స్ కూడా మూసేసిన నాని, అవినీతి ఆరోపణలతో, కోర్ట్ ల చుట్టూ తిరిగే పార్టీలో ఎలా జాయిన్ అవుతారని అనుకుంటున్నారు అంటూ, నాని సహచరులు అంటున్నారు.

Advertisements