జగన్ మోహన్ రెడ్డి గారి సాక్షి పత్రిక గురించి అందరికీ తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం కోసం, సాక్షి చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చెప్పి, చంద్రబాబు పై విష ప్రచారం చెయ్యటంలో సక్సెస్ అయ్యింది. అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, వార్తలు ఎలా రాసినా చెల్లింది. కాని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, వాళ్ళ రాతలు అలాగే ఉంటున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా రాయటం అనేది సర్వసాధారనం. అలాగే ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకుని రాస్తే కూడా ఇబ్బంది లేదు. కాని, ఒక నిర్ణయం తప్పు అని కేంద్రం తెలిస్తే, అది కరెక్ట్ అంటూ కేంద్రం చెప్పింది అంటూ ప్రజలను మభ్య పెడుతూ వార్తలు రాసారు. ఈ రోజు వచ్చిన ఈ వార్తా చూసి అందరూ అవాక్కయ్యారు.

sakshi 14082019 2

ఇంత బ్లంట్ గా ఎలా రాస్తారు, ప్రజలు ఏమన్నా అనుకుంటారు అని కూడా ఉండదా అంటూ ప్రజలు అనుకుంటున్నారు. నిన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో హైదరాబాద్ లో అత్యవసర సమావేశం అయ్యింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం నవయుగకి పోలవరం ప్రాజెక్ట్ క్యాన్సిల్ చెయ్యటం పై చర్చించారు. నవయుగ లాంటి కంపెనీని ఎందుకు వద్దు అంటున్నారు, రివర్స్ టెండరింగ్ వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది, ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది, దీని పై సమగ్ర రిపోర్ట్ ఇవ్వండి అంటూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి పత్రికలు ఈ విషయం పై వార్తలు రాసాయి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తప్పు పట్టింది అని రాసాయి. అయితే సాక్షి మాత్రం, అదేమీ లేదు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రివెర్స్ టెండరింగ్ కు అనుకూలంగా ఉంది అంటూ భిన్న వార్తా రాసింది.

sakshi 14082019 3

ఇలా తప్పు వార్తా రాసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ఏదైనా జగన్ పార్టీ కార్యక్రమం అయితే అనుకోవచ్చు, ప్రజలకు సంబధించిన విషయం కూడా, ఇలా మభ్యపెడుతున్నారు. ఇక రెండో వార్తా, పవన్ కళ్యాణ్ గురించి. ఎన్నికల ముందు వరకు అసలు పవన్ కళ్యాణ్ గురించి సాక్షి పట్టించుకునేది కాదు. జగన్ కూడా పవన్ ని పర్సనల్ గా టార్గెట్ చేసే వారు. అయితే ఎన్నికల ముందు అంటే అనుకోవచ్చు, ఎన్నికలు అయిన తరువాత కూడా అదే పంధా కొనసాగిస్తున్నారు. నిన్న, తెలకపల్లి రవి ఒక పుస్తకాన్ని, హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా ఆవిష్కరించారు. అయితే ఈ వార్తా ప్రచురించిన సాక్షి, ఆ ఫోటో ప్రచురించినప్పుడు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా, సగం ఫోటో మాత్రమే ప్రచురించి, తనకు జర్నలిజం కంటే, రాజకీయమే ఎక్కువ అని చెప్పింది. 151 సీట్లు వచ్చిన జగన్ కు, ఒక్క సీటు వచ్చిన పవన్ కళ్యాణ్ అంటే, ఇంకా అభద్రతా భావం లోనే ఉన్నారా ? అనే అభిప్రాయం కలుగుతుంది.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read