ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు నుంచి వస్తున్న అభ్యంతరాలు, వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఆందోళన పై ఈ రోజు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. కొద్ది సేపటి క్రితం ఆయన, ఒక బహిరంగ లేఖ విడుదల చేసారు. అలాగే ఇది పత్రికా ప్రకటనగా కూడా ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా ఉద్యోగుల విధి నిర్వహణ, అంటే పోలింగ్ విధుల్లో పాల్గునే ఉద్యోగుల విధి నిర్వహణకు సంబంధించి, తాము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో తాము ప్రొసీడింగ్స్ లో ఇది వరుకే చెప్పమని ఆయన చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గునే ఉద్యోగులకు పీపీఈ కిట్లు, సానిటైజర్ లు , పేస్ షీల్డ్స్ తో పాటు, క-రో-నా వ్యాక్సిన్ వస్తే, ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటుగా, ఉద్యోగులకు కూడా అదే ప్రాధాన్యత ఇచ్చి, వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి, తాను సూచించిన విషయాన్ని ఆయన ఆ లేఖలో గుర్తు చేసారు. దీంతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు, ఎన్నికల్లో కానీ, వచ్చే సవాళ్ళను ధీటుగా ఎదుర్కునే మనస్తత్వం ఉందని చెప్పి, ఇది ఎన్నో సార్లు కూడా నిరుపితం అయ్యిందని అన్నారు. ప్రస్తుతం కూడా రాజ్యంగ విధిగా ఉన్న ఎన్నికల నిర్వహణ అనేది, రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని చెప్పి, దీంట్లో అందరం కలిసి కట్టుగా పాల్గునాల్సిన బాధ్యత ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

letter 10012021 2

దీంతో పాటు, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నాయని, ఈ రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో ముఖ్యంగా రాష్ట్రంలో, ఇవి రాజ్యాంగం ప్రకారం నిర్వహించాల్సి ఉందని, ఇది ఒక రాజ్యంగ విధి అని కూడా అయన చెప్తూ, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పంచాయతీలకు కీలకంగా ఉండే పంచాయతీ పాలకవర్గాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి, కేంద్ర ఆర్ధిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్ధిక సంఘం నుంచి వచ్చే నిధులు కూడా వెంటనే అందాల్సి ఉందని, ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజ్యంగా విధిలో ఉండే ఈ ఎన్నికల ప్రక్రియలో అందరం కలిసి కట్టుగా, ఈ ఎన్నికలు విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు కూడా, ఎన్నికల సంఘం తీసుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఇటీవల చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక బృందం తనతో సమావేశం అయినప్పుడు కూడా, ఉద్యోగులు బద్రతకు సంబంధించి, అన్ని రకాల విషయాలు తాము వారికి వివరించినట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో, ఉద్యోగులకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో, అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తాము తీసుకుంటామని తెలిపారు.

Advertisements