రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుపతిలో అతి పెద్ద బహిరంగ సభ వేదిక పై నుంచి, ప్రధాని మోడీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మోసం గురించి, ఎండగట్టనున్నారు.. ఈ నేపధ్యంలో, రేపటి సభ కంటే ముందుగానే, బీజేపీ నేతలకు షాక్ తగిలింది... గత సాధారణ ఎన్నికల్లో తిరుపతి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన కారుమంచి జయరామ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు... రాజీనామా లేఖను నిన్న సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫ్యాక్స్‌లో పంపారు... రేపు తిరుపతిలో జరిగే ధర్మపోరాట దీక్ష బహిరంగ సభలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకొన్నారు...

ఆయన గత వారం రోజులుగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లె, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి అనుచరులు, స్నేహితుల అభిప్రాయాలను సేకరించారు. 2014లో పోలీస్‌ ఆఫీసర్‌ పదవికి రాజీనామా చేసి తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నియోజకవర్గ సమస్యలను రాష్ట్ర, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన అన్నారు..

బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు మూడు గ్రూపులు, ఆరు ముఠాలుగా కొనసాగుతున్నాయన్నారు. ‘నరేంద్ర మోదీ తిరుపతి బహిరంగ సభలో ఏడుకొండలుపైన, తిరునామం వైపు వేలెత్తిచూపుతూ ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. నేను దీనికి ప్రత్యక్ష సాక్షిని’’ అన్నారు. రాష్ట్ర ప్రగతి చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. రాష్ట్రాభివృద్ధిపట్ల నిరంతరం తపనపడే వ్యక్తి సారథ్యంలోని టీడీపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు జయరామ్‌ చెప్పారు.

Advertisements