ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అనే పార్టీ వోట్ షేర్, నోటా కంటే తక్కువ. ఇంకా చెప్పాలి అంటే, కాంగ్రెస్ కు ఎక్కువ వోట్ షేర్ ఉంది. అయినా బీజేపీ నేతలు చేసే హడావిడి మాత్రం అంతా ఇంతా కాదు. ఊపేస్తాం, కుమ్మేస్తాం అని హడావిడి చేస్తూ ఉంటారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, సహజంగా వీళ్ళ మాటకు కొంత వైటేజి ఉంటుంది. తెలంగాణాలో గెలిచారు అంటే, అక్కడ బీజేపీకి క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు. అన్నిటికీ మించి అక్కడ, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పై, బీజేపీ పోరాడుతుంది. కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్నారు. కాబట్టి, ప్రజలు బీజేపీని ప్రత్యామ్న్యాయం అనుకుంటూ ఉండవచ్చు. మన ఏపిలో మాత్రం, బీజేపీ, వైసీపీకి ఫ్రెండ్లీ పార్టీగా ఉంటుంది. వైసీపీకి ఇబ్బంది కలిగించే పనులు ఏమి చేయరు. వాళ్ళ టార్గెట్ మొత్తం టిడిపినే. అందుకే ఇక్కడ ప్రజలు బీజేపీని విశ్వసించారు. అన్నిటికీ ముంచి బీజేపీ చేసిన మోసం ప్రజలు అంత తేలికగా మర్చిపోరు. విభజన హామీలు గురించి బీజేపీ ప్రస్తావనే లేదు. అవేమీ మాట్లాడకుండా, కేవలం టిడిపిని టార్గెట్ చేయటం, మత పరమైన అజెండా తీసుకోవటంతో, బీజేపీ గత ఎన్నికల్లో ఎక్కడ ఉందో, ఇప్పుడు అక్కడే ఉంది. అయితే వీళ్ళు చేసే హడావిడి మాత్రం అంతా ఇంతా కాదు. బీజేపీ మైండ్ గేమ్ అంటూ, కొత్త రాజకీయ మొదలు పెట్టింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళను తమ వైపుకు తిప్పుకుంటాం అంటూ, హడావిడి చేస్తున్నారు.

somu 16012021 2

ఇందులో భాగంగా నిన్న తెలుగుదేశం పార్టీ ఏపి శాఖ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, అలాగే మరో సీనియర్ నేత పడాల అరుణను, సోము వీర్రాజు కలుస్తున్నారు అంటూ హడావిడి చేసారు. మైండ్ గేమ్ లో భాగంగా, బీజేపీ ఈ ప్లాన్ వేసిందని గ్రహించిన టిడిపి నేతలు వెంటనే రియాక్ట్ అయ్యారు. కళా వెంకట్రావ్ మాట్లాడుతూ, సోము వీర్రాజు వ్యాఖ్యలకు ఖండించారు. తానే కాదు, తన వారసులు కూడా ఎప్పటికీ టిడిపిలోనే ఉంటాం అని తేల్చి చెప్పారు. ఇక పడాల అరుణ కూడా అదే చెప్పుకొచ్చారు. దీంతో సోము వీర్రాజు నాలిక కరుచుకున్నారు. వెంటనే ప్రకటన విడుదల చేసి, నేను ఎవరినీ కలవటం లేదు, అని పత్రికా ప్రకటనలో వచ్చిన తప్పు అని కవర్ చేసేసారు. ఈ రోజు ముద్రగడను కలుస్తున్నానని చెప్పారు. అయితే, ఇంత పచ్చి తప్పులతో ఒక పార్టీ ప్రెస్ నోట్ ఎందుకు విడుదల చేస్తుంది ? ముద్రగడతో భేటీకి హైప్ రావటం కోసం, ఇలా చేసారా ? లేక మైండ్ గేమ్ లో భాగంగా ఇలా చేసారో కానీ, సోము వీర్రాజు ఆత్రంతో, బీజీపీ మరోసారి అభాసుపాలైంది. వెంటనే కళా వెంకట్రావ్, పడాల అరుణ ఖండించటంతో, ఎలా కవర్ చేసుకోవాలో తెలియక, ప్రెస్ నోట్ లో వచ్చిన తప్పు అని కవర్ చేసుకున్నారు.

Advertisements