ఈ రోజు అసెంబ్లీలో మధ్యానం స్పీకర్ కు, చంద్రబాబుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ సహనం కోల్పోయారు. తెలుగుదేశం వైసిపీ మధ్య ముందుగా గందరగోళం చెలరేగగా, ఆ తరువాత ఇది స్పీకర్, చంద్రబాబు మధ్య గోదావగా మారింది. సవాళ్లు , ప్రతి సవాళ్ళ వరకు విషయం వెళ్ళింది. తమకు మాట్లాడే అవకాసం ఇవ్వకుండా, వారి చేత ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తున్నారని, తమకు అవకాసం ఇవ్వాలని చంద్రబాబు నిరసన తెలిపారు. టిడ్కో ఇళ్ళకు సంబందించిన వ్యవహారంలో ఈ రోజు చర్చ జరిగింది. అయితే ఈ సందర్భంలో వరుస పెట్టి వైసీపీ నేతలకు అవకాసం ఇవ్వటం, వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ విమర్శలు చేయటంతో, తెలుగుదేశం పార్టీ అభ్యంతరం తెలిపింది. అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు ధీటైన సమాధానం తాము ఇస్తాం అని, తమకు అవకాసం ఇవ్వాలని పదే పదే అభ్యర్ధన చేసినప్పటికీ కూడా స్పీకర్ అవకాసం ఇవ్వలేదు. ఈ నేపధ్యంలోనే, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు లెగిసి, తమకు అవకాసం ఎందుకు ఇవ్వటం లేదు అని చెప్పి, నిలదీశారు. అధికార పార్టీ సభ్యులు మాట్లాడిన తరువాత అవకాసం ఇస్తాం అని స్పీకర్ చెప్పారు. అయితే వారు వరుసగా విమర్శలు చేస్తూ, తమను వ్యక్తిగతంగా తిడుతున్నా అవకాసం ఇవ్వటం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలియచేసారు. ఈ తరుణంలోనే స్పీకర్ కు చంద్రబాబుకు మధ్య మాటల యుద్ధం జరిగింది. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని, కనీసం ఒక్కసారి కూడా తమకు అవకాసం ఇవ్వటం లేదని, ప్రతిపక్షం గొంతు నొక్కితే ప్రజలకు ప్రశ్నించే అధికారం ఉండదు అని చంద్రబాబు చెప్పారు.

speaker 01122020 2

దీంతో తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని, నిబంధనలు ప్రకారం అవకాశాలు వస్తాయని స్పీకర్ అన్నారు. నిన్నటి నుంచి తమకు ఇప్పటి వరకు అవకశం ఇవ్వలేదని, ఇచ్చి పుచ్చుకోవటం నేర్చుకోవాలని, ప్రతిపక్ష నేతకు అవకాసం ఇవ్వకుండా ఎన్ని రోజులు ఇలా చేస్తారు అని చంద్రబాబు అనగా, మీ దగ్గర నుంచి నీతులు మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వేలు చూపించి నన్ను భయపెడతారా, మీ ఉడత ఊపులకు నేనేమీ భయపడను, మీ చేష్టలు ప్రజలు చూస్తున్నారు అని తమ్మినేని అనగా, మీ ప్రవర్తన కూడా చూస్తున్నారని, హుందాగా ఉండండి అని చంద్రబాబు అన్నారు. దీంతో సహనం కోల్పోయిన స్పీకర్, నువ్వు నువ్వు అని సంబోధించి, చేతిలో ఉన్న పేపర్ ను విసిరి పేపర్ మీదకు కొట్టటంతో, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా అదే దురుసుగా స్పీకర్ వద్దకు వచ్చి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ, నినాదాలు చేసారు. మొత్తానికి నిన్న ఇన్సురన్సు ప్రీమియం కట్టలేదని తెలుగుదేశం చెప్పటంతో, నిన్న సస్పెండ్ చేసారు. ఈ రోజు టిడ్కో ఇళ్లు గురించి అడిగితే, ఈ రోజు కూడా సస్పెండ్ చేసారు. తెలుగుదేశం సభ జరగనివ్వటం లేదని, అందుకే సస్పెండ్ చేసాం అని అధికార పక్షం అంటుంది.

Advertisements