ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో చేసుకున్న ఒప్పందం వెనుక దేవాదాయమంత్రి హస్తముంది ఉంది అంటూ, టిడిపి నేత బుచ్చిరామ్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేసారు. నిన్న టిటిడి ఆ సంస్థకు ఇచ్చిన, స్థలం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ "హరతికర్పూరంలా దేవాదాయభూములను ఈ ప్రభుత్వం మాయంచేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. మంత్రి ప్రోద్భలంతోనే టీటీడీ భూములను కట్టబెట్టే వ్యవహారం జరిగింది. ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో చేసుకున్న ఒప్పందం వెనుకు మంత్రి ఉన్నది వాస్తవమా...కాదా? ఆ ఒప్పందవివరాలను ఎందుకు బయటపెట్టడంలేదు? ఉగాదినాటికి ఉద్వేగ్ సంస్థతో చేసుకున్న ఒప్పందం వివరాలను బయటపెట్టి, అందుకుకారణమైన మంత్రిని ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి. లేకుంటే హిందూధార్మికసంస్థలతో కలిసి టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాము. ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీవారు రియల్ ఎస్టేట్, ఫైనాస్స్, కాంట్రాక్ట్, వంటి వ్యాపారాలు చేస్తామని చెప్పారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ చేస్తామనిచెప్పి యూరప్ లోనిర్మించిన స్టేడియాన్ని వారు కట్టినట్టు చూపారు. దానితోపాటు హైటెక్ సిటీ ఇమేజ్ ను కూడా వాడుకున్నారు. అంతటితోఆగకుండా సదరుసంస్థ ఇంటర్నెట్ ద్వారా డొనేషన్లను సేకరించి, వారికి నమ్మకం కలిగిన సంస్థకు ఇస్తామనిచెప్పారు. చిన్నమొత్తాలను ఎక్కువమందినుంచి ఆ విధంగా సేకరించి, తద్వారా వచ్చిన సొమ్మునే టీటీడీకి ఇస్తామని ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ చెబుతోంది. అంతేగానీ సదరు సంస్థ అకౌంట్ లో రూపా యికూడా లేదు. ఎవరై నా దానంచేయాలంటే వారి సొంతసొమ్ము ఇస్తారు. కానీ ఉద్వేగ్ సంస్థ విరాళాల సొమ్ము ఇస్తామనిచెబుతోంది. ఉద్వేగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్న టీటీడీ, సదరు సంస్థకు రూ.14కోట్లను కేటాయించింది."

"ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో చేసుకున్న ఒప్పందం వివరాలను కూడా టీటీడీ బహిర్గతం చేయలేదు. అంతరహస్యంగా దాచాల్సిన అవసరమేమిటి? చంద్రబాబునాయుడి గారి హాయాంలో అరబిందో సంస్థకు, టాటావారికి ఆసుపత్రి నిర్మాణాలను అప్పగించారు. ఆ విధంగా నిర్మించిన ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు తక్కువధరకే ప్రజ లకు అందుతున్నాయి. ఇప్పుడు ఉద్వేగ్ ఇన్ ఫ్రా సంస్థ కు కేటాయించిన స్థలం ఎక్కడో దూరంగా కేటాయించా రు. దీనివెనకున్నవారిపై ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఉద్వేగ్ సంస్థను రాష్ట్రప్రభుత్వానికి పరిచయం చేసింది దేవాదాయశాఖ మంత్రికాదా? ఒప్పందం జరగడానికి వారంముందే ఉద్వేగ్ సంస్థలో దేవాదాయ జిల్లాకు చెందిన ఇద్దరువ్యక్తులు డైరెక్టర్లుగా చేరింది వాస్తవమాకాదా? ఈ వ్యవహారం బయటపడినప్పటినుంచీ దేవాదాయ మంత్రి ఎందుకు బయటకు రావడం లేదు? దేవుడి భూములకు కూడా రక్షణలేని పరిస్థితి వైసీపీప్రభుత్వంలో నెలకొంది. గాలిమాటలు చెబుతూ, గాలిమేడలు కట్టే సంస్థకు విలువైన భూములిస్తారా? టీడీపీ హాయాంలో ఆసుపత్రి నిర్మించిన టాటావంటి ప్రతిష్టాత్మక సంస్థను కాదని టాటాచెప్పే తప్పుడు సంస్థలను తీసుకొస్తారా? టీటీడీప్రతిష్టకు మచ్చతెచ్చేలా వ్యవహరించిన మంత్రిని ఉగాదిలోగా ముఖ్యమంత్రి బర్తరఫ్ చేయాలి. తిరుపతి పార్లమెంట్ లోని ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలి. దేవుడి ఆస్తులమీద భయంలేని వ్యక్తులకు, ప్రైవేట్ ఆస్తులపై భయం ఉంటుందా? తిరపపతి పార్లమెంట్ లోని ఓటర్లంతా ఈ విషయంపై ఆలోచనచేసి, తెలుగుదేశంపార్టీకి ఓటేసి పనబాకలక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను."

Advertisements