ప్రభుత్వం తాజాగా మరో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ఏర్పాటుచేసిందని, రాష్ట్రంలో హైందవదేవాలయాలపై జరుగుతున్న ఘటనలపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ వేస్ట్ దని, దానివల్ల కొత్తగా ఒరిగేదేమీలేదని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యలు వర్ల రామయ్య తేల్చిచెప్పారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ...! గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో సీఐడీ వేసిన ప్రభుత్వం, ఇప్పుడు డీఐజీ స్థాయి అధికారి నేత్రత్వంలో సిట్ ను నియమించారు. ప్రభుత్వం ఏరకంగా తప్పటడుగులు, కుప్పి గంతులు వేస్తోందో ప్రజలుకూడా గమనించాలి. డీఐజీస్థాయి అధికారి నేత్రత్వంలో వేసిన సిట్ దర్యాప్తుతో హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఘటనల వెనకున్న వారిని పట్టుకుంటామని చెబుతూ, ప్రభుత్వం హిందువలను మభ్యపెట్టే కార్యక్రమమే. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా తూతూమంత్రపు విచారణలు చేయించదు. ఎవరు కుట్రలవెనకున్నారు... ఎవరి మేలుకోసం ఈ ఘటనల జరుగుతున్నాయనేది బయటకు రావాలంటే, సీబీఐ దర్యాప్తు ఒక్కటే మార్గం. ముఖ్యమంత్రి సీబీఐ దర్యాప్తు దిశగా ఎందుకుఆలోచన చేయరని మేం ప్రశ్నిస్తున్నాం. అడిషనల్ డీఐజీ స్థాయిలో సీఐడీ దర్యాప్తు చేస్తుంటే, స్థాయిని తగ్గించి, డీఐజీ స్థాయి నేత్రత్వంలో సిట్ ఏర్పాటుచేస్తే విచారణ సజావుగా సాగుతుందా?

ramatheerdham 10012021 2

అధికారి స్థాయిని తగ్గించడం వెనక ఫ్రభుత్వానికి ఉన్న ఆలోచనలే మిటి? రాష్ట్రంలోని హైందవభక్తుల మనోభావాలతో ప్రభుత్వం ఆట లాడుతోందని అర్థమవుతోంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మతసామరస్యానికి సంబంధించిన అతిసున్నితమైన సమ స్య విషయంలో ఇలాపిల్లలాటగా ప్రవర్తిస్తారా? డీఐజీస్థాయి అధికారి నేత్రత్వంలో సిట్ వేస్తే, దానితో అసలు దొంగలు దొరుకుతారా? గతంలో జగన్ బాబాయ్ కేసు విచారణలో కూడా సిట్ నియమించారు. ఇప్పటివరకు దానిపై ఏం వెలికితీశారు? విశాఖప ట్నం సహా పరిసరప్రాంతాల్లో నెలకొన్న భూవివాదాలపై సిట్ వేశారు దానితో ఏం సాధించారంటే సమాధానం లేదు. అమరావతి భూము లపై, కేబినెట్ కమిటీరిపోర్ట్ పై మరో సిట్ బృందాన్నినియమించిన ప్రభుత్వం చివరకు ఏంసాధించింది? అడిషనల్ డీఐజీ స్థాయి అధికారి నేత్రత్వంలోని సీఐడీని కాదని, డీఐజీ స్థాయి సారథ్యంలో నియమించిన సిట్ ఏంసాధిస్తుందని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు న్నాను. డీఐజీస్థాయికి విచారణను తగ్గించడం చూస్తుంటే, ప్రభుత్వ అపరిపక్వత స్ఫష్టంగా కనిపిస్తోంది. సీబీఐ దర్యాప్తుతోనే హైందవమతంపై జరుగుతున్న వరుస ఘటనల వెనకున్నవారు ఎవరో బయటపడుతుందని స్పష్టంచేస్తున్నాను. వరుసగా దేవాలయాలపై ఘటనల జరుగుతుంటే, ఈ ముఖ్యమం త్రి కాబట్టి కిమ్మనకుండాఉన్నారు" అని వర్ల రామయ్య అన్నారు..

Advertisements