తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిది పిల్లి.మాణిక్యరావు, విష్ణు వర్ధన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. ఆయన మాటల్లో... "బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తనపై జరిగిన దాడిని టీడీపీ కి అంటకట్టాలని ప్రయత్నించడం తన చేతకాని తనానికి నిదర్శనం. అంతేకాక స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పై దాడి జరిగినట్టు అబద్ధపు ప్రచారాన్ని చేయాలనుకోవడం తన అవివేకానికి నిదర్శనం. ఈ రాష్ట్రంలో దేశంలో నిజమైన లౌకిక వాద, ప్రజాస్వామిక పార్టీ తెలుగుదేశం పార్టీ. బిజెపి పార్టీ ఈ రాష్ట్రములో తను ఎదగడం కోసం ఆ పార్టీ ఎలాంటి పద్దతులను అవలంబిస్తుందో మేము ప్రస్తుతం ప్రస్తావించదలుచుకోలేదు. భౌతిక దాడులు, కుట్రపూరిత రాజకీయాలు, విధ్వంసకర నిర్ణయాలు ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతమో అందరికి తెలిసిందే. కొలికపూడి శ్రీనివాస్ అమరావతి పరిరక్షణ జేఏసీ కన్వీనర్. అమరావతి ఉద్యమాన్ని అవమానకర రీతిలో మీరు మాట్లాడుతూ... తను దళితుడానే చులకన భావనతో వ్యంగంగా వ్యవహారించడమే కాకుండా ఒక పార్టీకి బానిసని అనటం శ్రీనివాస్ తట్టుకోలేకపోయారు.

vishnu 25022021 2

తన ఆత్మగౌరవం పబ్లిక్ గా చరకు గురౌతుంటే, తట్టుకోలేక శ్రీనివాస్ ఆ చర్యకు పూనుకొని ఉండవచ్చు. అది పూర్తిగా నీ ఆధిపత్య,వికార వ్యక్తిత్వానికీ....శ్రీనివాస్ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దీనిలో నువ్వు తెలుగుదేశం పార్టీనీ నిందించడం నీ చేతకాని తనానికి నిదర్శనం. నీవు ఏ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నావో.. ఏ ఉద్యమాలను అవమానిస్తున్నావో... ఏ పార్టీలో ఉండి, ఏ పార్టీ కోసం పని చేస్తున్నావో... నీ నీచపు రాజకీయ సంస్కృతిని... నీ వ్యక్తిగత వ్యవహార శైలి ప్రజలకు అర్థం అవుతుంది. అందుకే నీపై కొలికపూడి శ్రీనివాస్ అలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చు. అయినా అలాంటి చర్యలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమర్ధించదు. కాబట్టి తెలుగుదేశం పై నిందలు వేయాలనే నీ ఆలోచన మానుకొని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పాత్రను నిర్వహిస్తావని, అధికార పార్టీ కుల తత్వం పోకడలను తొలగించుకుంటావని నీకు సూచన చేస్తున్నాము." అంటూ విష్ణు వర్ధన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

Advertisements