మాజీ మంత్రి, టిడిపి నేత కె. ఎస్ . జవహర్ ప్రభుత్వం పై మండి పడ్డారు. "వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం రేట్లను విపరీతంగా పెంచేసింది. దశలవారీగా మద్యపాన నిషేదం చేస్తామని భారీ ప్రకటన ఇచ్చి ప్రగల్బాలు పలుకుతున్నారు. ప్రభుత్వమే వ్యాపార సంస్థగా మారి అధికారుల చేత మద్యాన్ని అమ్మిస్తోంది. 75 శాతం రేట్లు పెంచితే మద్యం తాగరనడం హాస్యాస్పదం. లాక్ డౌన్ తో అందివచ్చిన అవకాశాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జారవిడిచింది. వైసీపీ తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్టుంది. వ్యవసం బలహీతను నియంత్రించకుండా మద్యపాన నిషేదాన్ని ఎలా సాధ్యం? ఒక దళితుడిని ఎక్సైజ్ మంత్రిగా పెట్టి ప్రకటనలో అతని ఫోటో కూడా వేయలేదు. పేరుకే మంత్రి, అధికారం మాత్రం లేదు. నాణ్యత లేని మద్యాన్ని మార్కెట్ లోకి తెచ్చారు.జే ట్యాక్స్ పేరుతో సంవత్సరానికి రూ. 5 వేల కోట్లు, ఐదేళ్లలో 25 వేల కోట్లు టార్గెట్ గా పెట్టుకుని దోచుకుంటున్నారు. నాశిరకం బ్రాండ్లతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజలను బలితీసుకోవడానికే ఎల్జీ పాలిమర్స్ ను తెరిపించారు."

"బూతు పురాణం తప్పించి మంత్రులకు ఏమీ రాదని ప్రజలకు అర్దమైంది. బాధితులకు కోటి ఇచ్చారు సరే. కచ్చులూరు బోటు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదు. క్విడ్ ప్రోకో ద్వారా మీకు ఎల్జీ కంపెనీ నుంచి వచ్చే వాటాలెంత? ముద్దాయిలతో ముచ్చట్లేంటి సీఎం గారికి? ఇంతటి విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మద్యపాన నిషేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందా లేదా? సారా నిషేద కమిటీలు ఎన్ని ఉన్నాయి? కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా లేదా? అదెక్కడ పనిచేస్తోంది? టీడీపీ హయాంలో డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించాం. యూనివర్సిటీలకు నేను స్వయంగా తిరిగాను. ఈ ప్రభుత్వం సారా నియంత్రించలేదు., గంజాయి ధ్వంసం చేసే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు. అనుకూలమైన పత్రికలకే ప్రటకనలు ఇస్తున్నారు."

"మూసివేసిన డిస్టరీలను ఈరోజు ఏ పేరుతో తెరిపించారు? నాశిరకం బ్రాండ్లను తీసకొచ్చారు. మీ బ్రాండ్లు నాణ్యమైనవి అయితే ఏపీలో తప్పించి మరెక్కడా దొరకడం లేదేంటి? ఇక్కడ ధరలు పెరగడంతో ప్రజలు తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటకలో నుంచి మద్యం తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు గారి గురించి మాట్లాడే హక్కు మంత్రులకు లేదు. కొడాలి నాని, నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి శాశ్వత రాజకీయ సమాధికి సిద్ధంగా ఉండాలి. టీడీపీ వేసిన కమిటీల్లో విద్యావంతులైన రామానాయుడు, చినరాజప్ప ఉన్నారు. ప్రభుత్వం వేసిన కమిటీలో నిపుణులు ఉండాలని కూడా పాలకులకు తెలియడం లేదు. ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. జగన్, బూతుల మంత్రులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ది చెప్తారు. రాజకీయ శాశ్వత నిద్రకు మంత్రులు సిద్ధంగా ఉండాలి. మీలా బేవర్స్ బ్యాచ్ టీడీపీలో లేరు. విద్యావంతుల నాయకత్వాన్ని టీడీపీ ప్రోత్సహించింది. బ్రోకర్ పనులు, మాఫియాలు బాగా చేసేవారికే వైసీపీలో పదవులు ఇచ్చారు."

Advertisements