ఆంధ్రప్రదేశ్ శాసనసభ గత అయుదు రోజులుగా జరుగుతుంది. అయితే అయుదు రోజులు తెలుగుదేశం ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. మొదటి రోజు పంటకు కట్టే క్రాప్ ఇన్సురన్సు ఎందుకు కట్టలేదు అంటే సస్పెండ్ చేసారు, రెండో రోజు పేదలకు టిడ్కో ఇళ్లు అడిగితే సస్పెండ్ అన్నారు, మూడో రోజు పోలవరం నిధులు పై కేంద్రం పై ఎందుకు ఒత్తిడి తేవటం లేదు అంటే సస్పెండ్ చేసారు, నిన్న 250 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారు అంటే సస్పెండ్ అన్నారు, ఈ రోజు నరేగా నిధుల పై అడిగితె సస్పెండ్ చేసారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ వాయిస్ వినిపించకుండా, వైసీపీ ఈ అయుదు రోజులు అసెంబ్లీ కానిచ్చేసింది అనే చెప్పాలి. అయితే వైసీపీ మాత్రం, ప్రజలు ఎదుర్కుంటున్న వాటి పై కాకుండా, మేము చాలా అద్భుతంగా చేసాం అని చెప్పటానికే, అసెంబ్లీ ఉపయోగించుకుని, సెల్ఫ్ భజన చేసుకున్నట్టు కనిపించింది. ఇదే సందర్భంలో ప్రతిపక్షాల పై దాడి చేసారు. అయితే ఈ సందర్భంగా నిన్న జగన్ మోహన్ రెడ్డి పెన్షన్ విషయాలు చెప్తూ, రామానాయుడు తప్పుడు సమాచారం ఇచ్చారని, తాము 45 ఏళ్ళకు పెన్షన్ అని చెప్పలేదని, మా మ్యానిఫెస్టో లో అలా లేదని, ఇప్పటికే ఈ విషయం పై ఒకసారి క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా, రామానాయుడు తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి, ఆయన పై ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలని సభలో చెప్పారు. దీనికి స్పీకర్ కూడా ఒప్పుకున్నారు.

jagan 04122020 2

అయితే ఇదే విషయం చెప్తూ, జగన్ మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం హయంలో పెన్షన్ లు కేవలం 44 లక్షలు మాత్రమే అని, దాన్ని మేము 60 లక్షలకు పైగా చేసాం అని చెప్పుకొచ్చారు. అయితే గతంలో తెలుగుదేశం హయాంలో 54 లక్షల పెన్షన్ లు ఇచ్చారు. ఇదే విషయం పై చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. గతంలో ఇచ్చిన వివరాలు చెప్తూ, ఆ సంఖ్యను జగన్ వచ్చిన తరువాత తగ్గించి, మళ్ళీ పెంచారని చెప్పుకొచ్చారు. అయితే జగన్, రామానాయుడు వ్యాఖ్యలు పై ప్రినిలేజ్ నోటీస్ ఇస్తాం అని చెప్పటంతో, దీనికి కౌంటర్ గా తెలుగుదేశం కూడా రంగంలోకి దిగింది. నిన్న జగన్ మోహన్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించారని, అందుకే ఆయన పై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని, జగన్‍పై సభాహక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ని కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇవ్వనున్నారు. ఈ రకంగా అయినా చర్చ జరిగి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని తెలుగుదేశం భావిస్తుంది.

Advertisements