రాజకీయాల్లో, ఒక రాజకీయ పార్టీ పై, మరొక రాజకీయ పార్టీ, ఆరోపణలు చేయటం సహజం. అయితే, మన రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి, ఇది వికృత రూపం దాల్చింది. వీరికి తోడుగా ఒక రాజకీయ పత్రిక, ఛానల్ కూడా తయారు అయ్యి, వీళ్ళు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. జరిగిన సంఘటన పై ఆరోపణలు, ప్రత్యారోపణలు అయితే పరవాలేదు కాని, వీళ్ళు మాత్రం, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసి, చివరకు ఇంట్లో ఆడవాళ్ళను కూడా వదలకుండా, విష ప్రచారం చేసారు. మొన్నటి ఎన్నికల్లో, సోషల్ మీడియాలో ఈ వికృత ప్రచారం ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే, వీరి ప్రచారాన్ని తిప్పి కొట్టి, ఏది నిజం, ఏది అబద్ధం అని చెప్పటంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలం అవ్వటంతో, అవతలి వారు చెప్పిందే నిజం అని ప్రజలు నమ్మటంతో, తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే.

heritage 21102019 2

అయితే, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారాన్ని, ఇప్పుడు ఎన్నికలు అయిన తరువాత, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వారసత్వం తీసుకునట్టు ఉంది. జనసేన పార్టీ అఫిషియల్ ఫేస్బుక్ పేజిలో, ఈ రోజు చంద్రబాబు కుటుంబం పై వేసిన పోస్టింగ్ చూస్తే ఇదే అనిపిస్తుంది. చంద్రబాబు కుటుంబం ఫోటో వేసి, అప్పట్లో చంద్రబాబు కుటుంబం, హోటల్ లో నివాసం ఉండి, ఆ బిల్లులు అన్నీ ప్రభుత్వం నుంచే చెల్లించారని, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని, పోస్టింగ్ వేసారు. ఇదే ప్రచారం, అప్పట్లో వైసీపీ కూడా చేసింది. అయితే, అప్పట్లోనే చంద్రబాబు కుటుంబం, ఇది హెరిటేజ్ కంపెనీ నుంచి బిల్లులు కట్టుకున్నామని, ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చెప్పారు.

heritage 21102019 3

అయినా ఈ వాదన మాత్రం ప్రజల్లోకి వెళ్ళలేదు. వైసిపీ చెప్పిందే నమ్మారు. అయితే, ఈ రోజు జనసేన మళ్ళీ అదే ప్రచారం మొదలు పెడుతూ, చంద్రబాబు కుటుంబాన్ని కూడా లాగటంతో, తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. హెరిటేజ్ నుంచి కట్టిన బిల్లులు వివరాలు పోస్ట్ చేస్తూ, జనసేన పై విరుచుకు పడింది. ఇది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రిప్లై "Nara Chandrababu Naidu కుటుంబంపై జనసేన అపనిందలు వెయ్యడాన్ని మేము ఖండిస్తున్నాం. చంద్రబాబు కుటుంబ అవసరాలకోసం ఎప్పుడూ ప్రజాధనాన్ని వాడుకోలేదు, అందుకు శ్రీమతి నారా భువనేశ్వరిగారు చేసిన చెల్లింపులే సాక్ష్యం. ఇప్పటికైనా JanaSena Party సోషల్ మీడియా నిజాలు తెలుసుకుని అసత్య ప్రచారం మానుకోవాలి." అయితే, ఇదే వివారాలు, అప్పట్లోనే వైసీపీ ప్రచారం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ బయట పెట్టి ఉంటే, ఇలాంటి ప్రచారాలకి అప్పుడే అడ్డుకట్ట పడేదని, తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు.

Advertisements