ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానన్నాయి. ముందుగా డిసెంబర్ 2వ తేది నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా, ఇప్పుడు డిసెంబర్ 9 నుంచి సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఒక పక్క అమరావతిని ఆపేయటం, పోలవరం ముందుకు వెళ్లకపోవటం, పెట్టుబడులు వెనక్కు వెళ్ళటం, ఇసుక అందుబాటులో లేకపోవటం, ఉపాధి హామీ పధకం డబ్బులు ఇవ్వకపోవటం, ఇంగ్లీష్ మీడియం చదువులు, నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, రోజుకి ఒక సమస్య పై, తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. అయితే, వీటి అన్నిటికీ అసెంబ్లీ వేదికగానే గట్టి సమాధానం చెప్పాలని, డేటా మొత్తం రెడీ చేసి, పూర్తీ సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి, ఇంకా ఏ పార్టీలో చేరని వల్లభనేని వంశీ వ్యవహారం కూడా, హాట్ టాపిక్ గా మారింది.

assembly 21112019 2

వల్లభనేని వంశీ తటస్థంగా కొనసాగనున్నారు. అయితే, వల్లభనేని వంశీ చేతే, అనేక విషయాల పై మాట్లాడించి, తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్పాలని, వైసిపీ భావిస్తుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, తన ప్రెస్ మీట్ లో, ఇసుక గురించి, ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు. వరదలు వస్తే ఇసుక ఎక్కడ నుంచి వస్తుంది అని ప్రశ్నించారు. అలాగే ఇంగ్లీష్ మీడియం వద్దు అంటున్న వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ నేపధ్యంలోనే, ఈ రెండు సమస్యల పై, వల్లభనేని వంశీ చేత మాట్లాడించి, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని డిఫెన్సు లోకి నెట్టాలని, ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి, వ్యూహాలు పన్నుతున్నారు. అయితే, దీనికి రివర్స్ ప్లాన్ ని కూడా తెలుగుదేశం పార్టీ రెడీ చేస్తుంది.

assembly 21112019 3

వల్లభనేని వంశీ పార్టీ పై చేసిన విమర్శలకు వివరణ అడుగుతూ సస్పండ్ మాత్రమే చేసామని, పార్టీ నుంచి బహిష్కరించలేదని, ఆయన ఇంకా మా పార్టీ సభ్యుడుగానే ఉన్నారని తెలుగుదేశం చెప్తుంది. అసెంబ్లీలో పార్టీ లైన్ ధిక్కరించి ఎవరూ మాట్లాడ కూడదు అంటూ, తెలుగుదేశం పార్టీ విప్ జారీ చెయ్యాలని భావిస్తుంది. ఇలా విప్ జారీ చేసిన తరువాత కూడా, వల్లభనేని వంశీ వ్యతిరేకంగా మాట్లాడితే, అప్పుడు ఆయన పై అనర్హత వేటు వెయ్యాలని, స్పీకర్ ను తెలుగుదేశం కోరుతుంది. వైసిపీ ఆ ప్లాన్ వేస్తే, తెలుగుదేశం పార్టీ ఇలా రివర్స్ ప్లాన్ వేసింది అనర్హత వేటు పడితే ఇబ్బంది కాబట్టి, వంశీ కొంచెం వెనక్కు తగ్గే అవకాసం ఉంది. అలాగే మరో ఒకటి రెండు మంది టిడిపి ఎమ్మెల్యేలను, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే, తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ భావిస్తుంది. దానికి కూడా, ఈ విప్ ఉపయోగపడుతుందని, తెలుగుదేశం భావిస్తుంది.

Advertisements