తానెందుకు ఢిల్లీ వెళ్లొచ్చాడు.. ప్రధానితో ఏం చర్చించాడనేది జగన్మోహన్‌రెడ్డి ఇంతవరకు స్పష్టంచేయలేదని, శాసనమండలిరద్దు, మూడురాజధానుల ఏర్పాటు అంశాలపై చర్చించడానికే ఆయన ఢిల్లీవెళ్లినట్లు స్పష్టమవుతోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు స్పష్టంచేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీలు, రామకృష్ణ, బీ.ీ.నాయు డుతో కలిసి మంగళగిరిలోని పార్టీకేంద్ర కార్యాలయంలో విలేకరులతో మ్లాడారు. తనకు అనుకూలంగా వ్యవహరించలేదన్న అక్కసుతో మండలిని రద్దుచేయాలనుకుం టున్న జగన్‌, తనకు అధికారముంటే రాజ్యసభను, లోక్‌సభను కూడా రద్దుచేసిఉండే వాడని అశోక్‌బాబు ఎద్దేవాచేశారు. జగన్‌ తనరాజకీయ కక్షకోసమే మండలిరద్దుకు పూనుకున్నాడనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, ప్రజాస్వామ్యవ్యవస్థలను కాపాడుకునేందుకు కలిసివచ్చేఇతరపార్టీల సభ్యులను కలుపుకొని ఢిల్లీ వెళతామని టీడీపీనేత తెలిపారు. ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులను కలిసి, మండలిరద్దుకు జగన్‌అనుసరిస్తున్న కారణాలను వారికి వివరిస్తామన్నారు. పదిరాష్ట్రాలు మండలిఏర్పాటును కోరుకుంటున్నాయని, కేవలం తననిర్ణయాన్ని అడ్డు కున్నారన్న అక్కసుతోనే జగన్‌ పెద్దలసభపై కక్ష క్టాడన్నారు. సీఆర్డీయేరద్దు, మూడురాజ ధానుల ఏర్పాటు నిర్ణయాలను అడ్డుకోవడమే మండలిచేసిన తప్పిదంగా జగన్‌ భావిస్తు న్నాడన్నారు. ఇదివరకే ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నామని, పార్లమ్‌ెంసమావేశాలు, అమరావతి జే.ఏ.సీసభ్యుల ఢిల్లీపర్యటనతో తమనిర్ణయాన్ని వాయిదావేసుకున్నామని అశోక్‌బాబు తెలిపారు.

అసెంబ్లీలో మేథావులున్నారని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మూడురాజధానుల నిర్ణయం తీసుకున్నందుకు బాధ్యతవహి స్తూ, అసెంబ్లీనికూడా రద్దుచేయాలని అశోక్‌బాబు డిమాండ్‌చేశారు. కేవలం బిల్లులకు సూచనలు, సవరణలు చేశారని వ్యవస్థల్ని రద్దుచేయాలనుకునే ముఖ్యమంత్రి, అసెంబ్లీ రాష్ట్రానికి అవసరంలేదని, ఆయన దాన్ని రద్దుచేస్తాడా అని అశోక్‌బాబు ప్రశ్నించారు. ఎమ్మెల్సీలెవరూ అడ్డదారుల్లో, గాలికి కొట్టుకురాలేదనే విషయాన్ని జగన్‌ గుర్తిస్తేమం చిదన్నారు. వచ్చే ఏడాదినుంచి ప్రభుత్వ, ప్రైవ్‌ేపాఠశాలల్లో ఒకి నుంచి 6వతరగతి వరకు నిర్బంధ ఆంగ్లమాధ్యమబోధనను అమలుచేయడానికి సిద్ధపడిన ప్రభుత్వం, ఆనిర్ణయానికి తల్లిదండ్రుల కమిీలు కూడా అంగీకారం తెలిపాయని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ ఏ.ఎస్‌.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేలా, తల్లిదండ్రులకమిీలను బెదిరించడం ఒకకారణమైతే, వారికి ఇంగ్లీషు బోధనపై సరైన అవగాహనలేకపోవడం మరోకారణమన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మ కతను వెలికితీయడానికి పనికొచ్చే తెలుగుబోధననుకాదని, ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడంవల్ల, పిల్లల్లో ఒత్తిడి అధికమవుతుందని, భవిష్యత్‌లో డ్రాపవ్స్‌ు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

ఏమీడియంలో చదవాలనేది విద్యార్థినీ, విద్యార్థులకు ఐచ్ఛికాంశంగా ఉండాలితప్ప, బలవంతగా అమలుచేయడం సరికాదన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 3,500లకు పైగా మున్సిపల్‌పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశప్టిెందన్నారు. ఆప్పుడు బట్టలూడదీసి గగ్గోలుప్టిెన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నేడు ఎక్కడకు పోయాడని రామకృష్ణ నిలదీశారు. తెలుగుఅకాడమీ ఛైర్మన్‌గా ఉన్న లక్ష్మీపార్వతిని పక్కనే కూర్చొబెట్టుకొని మంత్రి ప్రకటన చేశాడని, తెలుగుభాషే లేకపోతే, ఆమెకు ఆపదవులు ఎందుకని ఏ.ఎస్‌. ప్రశ్నించారు. పిల్లలకు, తల్లిదండ్రులకు స్వేచ్ఛలేకుండా, ఎంఈవోలు, డీఈవోలద్వారా తల్లిదండ్రుల కమిీలు ఒప్పుకున్నాయని చెప్పించారని, కుప్పంలోని పాఠశాలలన్నీ ఆంగ్లానికి ఓటేశాయనడం దుర్మార్గమన్నారు. ఒకతటస్థమైన ఏజెన్సీద్వారా ప్రజల్లో ఇంగ్లీషుమా ధ్యమంపై రహస్యఓింగ్‌ జరపాలని ఆయన డిమాండ్‌చేశారు. విద్యాహక్కుచట్టం, జాతీయ విద్యావిధానం, రాజ్యాంగం మాతృభాషలోనే విద్యాబోధన జరపాలని స్పష్టం చేస్తున్నాయని, అవేవీ ప్రభుత్వం ప్టించుకోవడంలేదన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధం గా రాష్ట్రప్రభుత్వమే నిర్బంధ ఆంగ్లమాధ్యమబోధనను అమలుచేస్తోందన్నారు. విద్య విషయంలో కూడా వైసీపీ ఓట్లరాజకీయాలు చేస్తోందని, కోర్టులు ఈవిధానాన్ని తప్పు ప్టినా, ప్రభుత్వం తనవైఖరి మార్చుకోవడంలేదన్నారు.

వచ్చే బడ్జ్‌ెసమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్‌పై ప్రివిలేజ్‌మోషన్‌ నోీస్‌ ఇస్తామని, ీడీపీ ఎమ్మెల్సీ బీ.ీ.నాయుడు తెలిపారు. ఆర్టికల్‌169 ప్రకారం ఏర్పడిన మండలి గురించి, ఛైర్మన్‌గురించి చులకనగా మ్లాడి, గవర్నర్‌తర్వాత అంతిహోదా ఉన్న ఛైర్మన్‌ను దుర్భాషలాడినందుకు ముఖ్యమంత్రిపై ప్రివిలేజ్‌మోషన్‌ నోీసు ఇవ్వడానికి నిర్ణయించామన్నారు. శాసససభకు ఎన్నికైనవారే ప్రజలద్వారా ఎన్నుకోబడ్డారని, మండ లి సభ్యులంతా దొడ్డిదారిన వచ్చారనే పదాన్ని ముఖ్యమంత్రి వినియోగించాడన్నారు. గ్రాడ్యుయ్స్‌ే, ీచర్స్‌, స్థానికసంస్థల సభ్యులద్వారా, గవర్నర్‌, ఎమ్మెల్యేలద్వారా ఎన్ను కున్నవారంతా అసమర్థులన్నట్లుగా అసెంబ్లీలో చిత్రీకరించాలని ముఖ్యమంత్రి ప్రయ త్నించాడన్నారు. నిద్రనిస్తున్న జగన్‌కు అన్నీ తెలిసొచ్చేలా చేస్తామన్నారు. రాష్ట్రపతి నుంచి గ్‌ిెనోిఫికేషన్‌ వచ్చేవరకు మండలికొనసాగుతుందన్నారు. మండలికార్యదర్శి, ఛైర్మన్‌పై ధిక్కారస్వరం వినిపించడానికి ప్రభుత్వమే కారణమన్నారు.

Advertisements