విశాఖపట్నం లో ప్రజా చైతన్య యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ నేత మాజి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఈ పిటీషన్ దాఖలు చేసారు. విశాఖ విమానాశ్రయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టులో లంచ్ మోషన్ ను పిటిషన్ దాఖలు చేసారు టీడీపీ నేతలు. విచారణను న్యాయస్థానం స్వీకరించింది. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర కు ముందస్తు అనుమతి తీసుకున్న వైసిపి కార్యకర్తలని నిలువరించడంలో పోలీసులు వైఫల్యం చెందారని తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది పిటీషన్ వేసారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 వాదనలు ధర్మాసనం విననుంది. మధ్యాహ్నం కోర్ట్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేదాని పై అటు తెలుగుదేశం పార్టీ, ఇటు ప్రభుత్వం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. పర్మిషన్ ఇచ్చిన పోలీసులు, తరువాత వైసీపీ కార్యకర్తలను అంత మందిని ఎయిర్ పోర్ట్ లో, అనుమతి ఎందుకు ఇచ్చారు అంటూ, ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే విషయం కోర్ట్ కూడా అడిగే అవకాశం ఉంది.

నిన్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో చంద్రబాబుని గట్టిగానే అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ శ్రేణులకూ, వైఎస్సార్‌సీపీ శ్రేణులు మధ్య తోపులాట, వాగ్వివాదాల మధ్య తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. చంద్రబాబు రాకను వైఎస్సార్‌ సీపీ శ్రేణులు గోబ్యాక్.. గోబ్యాక్ నినాదాలు చేయగా... రావాలి చంద్రబాబు... జిందాబాదు. చంద్రబాబు అంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు నినాదాలతో ఎయిర్ పోర్టు ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఉదయం నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకూ కూడా ఎయిర్పోర్టు ఆవరణంలో ఉద్రిక్తత కొనసాగింది. నగరంలోకి అనుమతివ్వకుండా రాత్రి ఎడున్నర గంటల సమయంలో చంద్రబాబును హైదరాబాదుకు తిప్పి పంపడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన నేపధ్యంలో ఆయనకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, మద్దతుగా టిడిపి శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ నేపధ్యంలో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరకముందే... వైఎస్సార్సీ, టిడిపి కార్యకర్తలు, ప్రజాసంఘాలు తదితరులు ఎయిర్‌పోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు.

అదే సమయంలో.. వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా చంద్రబాబును పోలీసులు కోరారు. అనుమతి ఇచ్చాక వెనక్కి ఎందుకు వెళ్లిపోవాలంటూ చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. గంటపాటు నిరీక్షించిన అనంతరం శాంతి భద్రతల సమస్యల పరిరక్షణకు పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 151 కింద చంద్రబాబుకు ముందస్తు నోటీసు ఇచ్చి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చంద్రబాబుతో పాటు టిడిపి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎయిర్పోర్టులోని లాంజ్ కు తరలించారు. సాయంత్రం నాలుగు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్లోకి చేరుకున్న చంద్రబాబు, మాజీ మంత్రి చిన రాజప్ప, ఎమ్మెల్యేలు వాస వల్లి గణేష్ కుమార్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు వివిధ అంశాలపై చర్చించారు. శాంతిభద్రతల నడుమ విజయవాడకు కానీ... హైదరాబాదుకు కానీ తిరిగి వెళ్లాలని పోలీసులు కోరినప్పటికీ... తాను వెళ్లేది లేదని తన పర్యటనకు అనుమతి ఇచ్చి... తనను ఎందుకు నిర్బంధించారని చంద్రబాబు ప్రశ్నించారు. తాను వెనక్కి వెళ్లే సమస్యే లేదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కొన్ని శుభకార్యాలకు కూడా వెళ్లాల్సి వుందని చెప్పినప్పటికీ.. పోలీసులు మాత్రం నగరంలోకి వెళ్లేది లేదని స్పష్టంచేశారు. దీంతో రాత్రి ఏడున్నర గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబును విమానంలో హైదరాబాదుకు పంపించారు.

Advertisements