ఇన్నాళ్ళు ప్రశాంతంగా, ఎలాంటి అహింస లేకుండా, అమరావతి ఉద్యమం సాగుతుంది. భూములు ఇచ్చిన రైతులు, గత 35 రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎక్కడా అదుపు తప్పలేదు. అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమంలో, వాళ్ళు దెబ్బలు తిన్నారే కాని, ప్రభుత్వ ఆస్తులుని ఏమి చెయ్యలేదు. ఇలా ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమాన్ని, హింసాత్మికం చెయ్యటానికి, నిజమైన పైడ్ ఆర్టిస్ట్ లు బయలు దేరారు. ఈ రోజు గుంటూరు జిల్లా తెనాలిలో, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, మూడు ముక్కల రాజధాని వద్దని, తెనాలి మున్సిపల్‌ కార్యాలయం దగ్గర, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు, తెలుగుదేశం శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వచించాయి. తెనాలి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఒక శిబిరం ఏర్పాటు చేసుకుని, గత కొన్ని రోజులుగా, నిరసన చేపడుతున్నారు. అయితే ఈ రోజు అక్కడకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు, వీరంగం సృష్టించారు. తమకు ఈ రాష్ట్రంలో, ఏదైనా చేసే లైసెన్స్ ఉంది అనే విధంగా, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు.

tenali 25012020 2

ముందుగా, దీక్షా శిబిరం పై, వైసీపీ కార్యకర్తలు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. తరువాత, దీక్షా శిబిరానికి నిప్పు పెట్టరు. దీంతో వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు, వారిని ఆపే ప్రయత్నంలో తోపులాట జరిగింది. అక్కడ దీక్షలో ఉన్న మహిళలకు కూడా గాయాలు అయ్యాయి. దీక్షా శిబిరానికి మంటలు వ్యాపించకుండా, మంటలు ఆర్పి వేసారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ క్రమంలోనే, తెనాలి తెదేపా పట్టణ అధ్యక్షుడు మహ్మద్‌ ఖుద్దూస్‌ను కూడా, వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టారు. విషయం తెలుసుకున్న, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అక్కడు రాగా, ఆయన పై కూడా, కోడి గుడ్లు వేసి దాడి చేసారు. ఈ క్రమంలో అక్కడ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు కూడా ఉన్నారు.

tenali 25012020 3

మండలిలో బిల్ ఓడిపోవటంతో, వైసీపీ ఉన్మాది చేష్టలు బయట పడుతున్నాయని, ఇవి ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయని, టిడిపి అంటుంది. దాడి పై, నారా లోకేష్ ట్విట్టర్ లో స్పండించారు. "రైతులపై దాడి చేయించి రైతు ద్రోహిగా YS Jagan Mohan Reddy గారు మరింత దిగజారారు. ప్రజల్ని ఒప్పించలేని వాడే దాడులకు తెగబడతాడు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవు అన్న విషయం ప్రజలకు అర్థమైపోయిందనే ఆందోళన జగన్ గారిని వెంటాడుతోంది. అందుకే వైకాపా రౌడీలను రంగంలోకి దింపి శాంతియుతంగా రైతులు దీక్ష చేస్తున్న తెనాలి అమరావతి జేఏసీ శిబిరానికి నిప్పు అంటించారు.రైతులు, మహిళల పై విచక్షణారహితంగా వైకాపా గుండాలు దాడులు చేసారు. తెనాలిలో వైకాపా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. జగన్ గారి తాటాకు చప్పుళ్ళకు భయపడే వారు ఎవరూ లేరు.రైతుల పై చెయ్యి వేసిన వాళ్ళు నాశనం అయిపోతారన్న విషయం గుర్తుపెట్టుకోండి జగన్ గారు." అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

Advertisements