ఆంధ్రుల ఆశల సౌధం... అమరావతి నిర్మాణాలు మొదలు కానున్నాయి.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది... అమరావతి అంటే అది పీపుల్స్ కేపిటల్... అది వన్ అఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ కావలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సార్లు మేధో మధనం చేసి, మైన్యూట్ విషయాలు కూడా పర్ఫెక్షన్ వచ్చేలా చేసి, డిజైన్లు ఫైనల్ చేసారు... ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యం అయినా, డిజైన్లు ప్రజలందరికీ నచ్చాయి... మరో పక్క, భ్రమరావతి అనే హేళన చేసే బ్యాచ్ ఉంటానే ఉంది... ఇవన్నీ పక్కన పెడితే, అమరావతి నిర్మాణాల పై ఇక దూకుడుగా వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది... నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత కీలకమిన్ సచివాలయ భవన నిర్మాణానికి ఏపీసీఆర్డీయే పూనుకుంటోంది.

మొత్తం ఐదు ప్రధాన టవర్లు, వాటికి అనుబంధంగా ఉండే భవనాల నిర్మాణానికి, మూడు ప్యాకేజీలుగా సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది... ఈ మూడు ప్యాకేజీల అంచనా విలువ మొత్తం 2176 కోట్లు... వీటిలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనానికి రూ.530 కోట్లు, 1, 2 టవర్ల నిర్మాణానికి రూ.895 కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణానికి రూ.751 కోట్లతో సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది. బిడ్‌లు దాఖలు చేయడానికి, మే 16 వరకు సీఆర్‌డీఏ టైం ఇచ్చింది. పరిపాలనా నగరంలో పాలవాగుకు ఉత్తర, దక్షిణ దిశల్లో మొత్తం 5 టవర్లతో సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ ఆవిర్భవిస్తుంది. పాలవాగుకు ఒకపక్కన మూడు టవర్లు, మరో పక్కన రెండు టవర్లు వస్తాయి.

సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ మొత్తం 32 ఎకరాల్లో, సుమారు 69 లక్షల చదరపుటడుగుల వైశాల్యంతో రూపుదిద్దుకోనుంది. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, కార్యదర్శులు, జీఏడీ కొలువుదీరనున్న టవర్‌ 50 అంతస్థులతోనూ, వివిధ శాఖాధిపతులు, ఉన్నత స్థాయి అధికారులు, ఉద్యోగుల కోసం మిగిలిన 4 టవర్లు ఒక్కొక్కటీ 40 అంతస్థులతోనూ నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం 46వ అంతస్తులో ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయ పైనే హెలిప్యాడ్‌ ఉంటుంది. ఈ ఐదు టవర్లను కలుపుతూ ఒక ఎలివేటెడ్‌ మార్గం ఉంటుంది. అన్ని భవనాల్లో మాదిరిగా ఇందులో పిల్లర్లు ఉండవు. పిల్లర్లకు బదులుగా డయాగ్రిడ్‌ డిజైన్లు మోస్తాయి. కలంకారీ డిజైన్‌లో ఈ డయాగ్రిడ్‌ ఉంటుంది.

Advertisements