టీటీడీ పాలకమండిలి కొన్ని నెలల నుంచి పెండింగ్ లో ఉంది.... టీటీడీ చైర్మన్ గా, కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది... కాని ఆయనాకు అన్యమత సంస్థలతో సంబంధం ఉంది అంటూ ప్రచారం రావటంతో, నియామకం వాయిదా పడింది.. ఇది ఇలా ఉండగానే,మంగళవారం నారావారిపల్లెలో మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు మాట్లాడుతూ టీటీడీ బోర్డు వేస్తున్నానమని చెప్పటంతో సర్వత్రా ఆసక్తి నెలకుంది. ఈ విషయం తెలియడంతో ఎవరికి వారు పాలకవర్గంలో చోటుకోసం ప్రయత్నిస్తున్నారు... సభ్యులుగా ఎవరిని నియమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

cbn ttd 18012018 2

గత పాలకమండలిలో చిత్తూరు జిల్లా నుంచి చైర్మన్‌తో పాటు ఇద్దరికి అవకాశం దక్కింది. టీడీపీ కోటా కింద చైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి, బోర్డు బీజేపీ సభ్యుల్లో భానుప్రకాష్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోటాలో డాక్టర్‌ హరి ప్రసాద్‌ నియమితులయ్యారు. ఇప్పుడు చైర్మన్‌ పదవి చిత్తూరు జిల్లాకు లేనందున ఈసారి చిత్తూరు జిల్లా నుంచి, ముగ్గురికి అవకాశం ఇస్తారా, లేదా ఇద్దరికే ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. మిత్రపక్షం బీజేపీలో ఒకరికి తప్పకుండా ఇస్తారనేది స్పష్టం. అయితే, పార్టీ ఎవరినైనా ప్రతిపాదిస్తుందో అనేది చూడాలి.. అలాగే పవన్‌ కల్యాణ్‌ ఈ సారి కూడా ఎవరినైనా ప్రతిపాదిస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది... చిత్తూరు జిల్లా నుంచి, టిటిడి బోర్డులో, ఎమ్మెల్యే, బలిజ కోటా కింద సత్యప్రభకు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయనిభావిస్తున్నారు.

cbn ttd 18012018 3

ఆలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి చల్లా బాబురెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ నేత జయచంద్రారెడ్డి ఆశిస్తున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి డాక్టర్‌ సుధారాణి, మందలపు మోహన్‌రావు, రామచంద్రాపురం మాజీ ఎంపీపీ కేశవులు నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి... బీజేపీ నుంచి భానుప్రకాష్‌ రెడ్డి, కోలా ఆనంద్‌, శాంతారెడ్డి దక్కే అవకాసం ఉన్నట్లు బావిస్తాన్నారు... ఇక ఈసారి కూడా జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఎవరినైనా సిఫార్సు చేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది... ఇక పోతే నందమూరి కుటుంబీకులు ఎన్టీ రామారావు వీరాభిమాని ఎన్టీఆర్‌ రాజు పేరును ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పైగా దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు ఈసారి కూడా పాలకమండలిలో చోటు కల్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది . ఇటు పవన్ ఎవర్నైన సిఫార్సు చేస్తారా లేక నందమూరి వాళ్ళు ఎవర్నైన సిఫార్సు చేస్తారా ? టీటీడీ బోర్డులో ఎవరికి స్థానం దక్కుతుంది ? చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి...

Advertisements