ప్రసిద్ధ హిందూ ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దల , ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. ప్రచురణ విభాగం ఉద్యోగుల నిర్లక్ష్యం వెరసి సప్తగిరి మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం రాయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ విషయంపై అటు శ్రీవారి భక్తులు ఇటు హిందు ఆధ్యాత్మిక సంస్థలు, బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో నిరసన తెలియజేస్తున్నారు. ఈ తప్పి దంతో మరోసారి టిటిడి వివాదాలను కొనితెచ్చు కొన్నట్ల య్యింది. తిరుమల తిరువతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలవారీగా ఆధ్యాత్మిక భక్తి ప్రధానమైన విషయాలతో, తిరుమల ఆలయంతో బాటు టిటిడి అనుబంధ ఆలయాల్లో జరిగే కైంకర్యాలు, విశేషాలతో భక్తులకు సమాచారాన్ని తెలిసేలా సప్తగిరి మాసపత్రికను ఐదు భాషల్లో ముద్రించి పంపిణీ చేస్తుంది. నెలవారీగా హిందు ఆధ్యాత్మిక విషయాలు, ఆలయాల్లో కార్యక్రమాల ప్రచురణకు ప్రాధాన్యతనిస్తుంది. తాజాగా టిటిడి ప్రచురించి మార్కెట్లోకి విడుదల చేసిన ఏప్రిల్ నెల సప్తగిరి మాసవత్రికలో వివాదం రేగింది.

రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం రాశారంటూ తిరుపతిలో బిజెపి నాయకులు మంగళవారం టిటిడికి చెందిన శ్రీకోదందరామాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. శ్రీసీతారాములకు లవుడు ఒక్కడే కుమారుడని, కుశుడు దర్భతో వాల్మీకి ప్రాణం పోసి చేసిన బొమ్మ అంటూ జానపథకథలో కథనం ప్రచురించారు. ఈ కథను తిరువతికి చెందిన తొమ్మిదోతరగతి బాలుడు పునీత్ రాశాడు. దీనిపై బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. టిటిడి వంటి ధార్మిక సంస్థ వాల్మీకి రచించిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. జానపదాల్లో రకరకాల ప్రచారం పై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతుందని వారు నిరనన తెలిపారు. ఇదిలా వుండగా మాసపత్రిక ముద్రణ ఎడిటర్, సబ్ ఎడిటర్లు పర్యవేక్షిస్తారు. అలాంటిది ఇంతవరకు ఎంతో ప్రాధాన్యత వున్న సవగిరికి ఈ తప్పుడు కథనంతో పాఠకుల్లో నమ్మకం కోల్పోయి విశ్వాసం పోతుందని భక్తులు వాదనలు.

Advertisements