తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వస్తున్నా అంటూ జగన్ ముందు చెప్పటం, దానికి తగ్గట్టు భారీ ఏర్పాట్లు చేయటం, తరువాత అమ్మో క-రో-నా ఉంది నాకు బాధ్యత ఎక్కువ అంటూ, జగన్ మీటింగ్ రద్దు చేసుకోవటం తెలిసిందే. అయితే రేపు వాలంటీర్లకు సేవా మిత్రా అవార్డులు అంటూ, మీటింగ్ లో పాల్గుంటున్న జగన్, అక్కడ మాత్రం క-రో-నా రాదా ? బాధ్యత లేదా అంటే సమాధానం లేదనే చెప్పాలి. అయతే జగన్ మోహన్ రెడ్డి అసలు ఎందుకు మీటింగ్ రద్దు చేసుకున్నారో, ఎవరి విశ్లేషణలు వాళ్ళు చెప్తున్నారు. దీని పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి కూడా స్పందించారు. జగన్ సభ రద్దు చేసుకోవటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని తనకు అనిపిస్తుందని అన్నారు. మొదటిది, తన మీటింగ్ కు జనసమీకరణ ఫెయిల్ అవుతుంది ఏమో అనే భావనలో ఆయన ఉన్నారని అన్నారు. రెండోది సభలో ఏమి మాట్లాడాలో, ఎవరిని టార్గెట్ చేయాలో, బీజేపీ గురించి మాట్లాడాలో, ఇలా ఏది చెప్పాలో తెలియని కన్ఫ్యూషన్ లో ఉన్నారని అన్నారు. ఇక మూడోది, బహుశా ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే రిపోర్ట్ ఏమైనా వచ్చి, వెనకడుగు వేశారేమో అని తులసిరెడ్డి అన్నారు.

Advertisements