నిన్న ఒక ప్రాముఖ పత్రికలో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటూ ఒక సంచలన వార్త ప్రచురితం అయ్యింది. ఈ వార్త చుసిన వారు అందరూ ఒక్కసారిగా అవాకయ్యారు. ఆంధ్రజ్యోతి కధనం ప్రకారం, కొంత మంది హైకోర్టు జడ్జీలకు జరిగిన స్వీయ అనుభవం రాసుకొచ్చారు. ఒక జడ్జికి ముందుగా, ఒక మెసేజ్ వచ్చి, సంచలన జడ్జిమెంట్ కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి అని రావటం, ఆయన ఆ లింక్ క్లిక్ చేసిన దగ్గర నుంచి, ఫోన్ లో ఏదో తేడా గమనించారని, ఆ వార్త ప్రచురితం అయ్యింది. అప్పటి నుంచి ఫోన్ వస్తున్నప్పుడు ఏవో శబ్దాలు రావటం, అలాగే వాట్స్ అప్ మెసేజిలు చూడకుండానే, చూసినట్టు రావటం, ఇవన్నీ అనుమానం వచ్చి, సర్వీస్ ప్రొవైడర్ ని పిలిపించగా, ఫోన్ లో ఏదో బగ్ ఉన్నట్టు, అది సరిచేసినట్టు, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ సమస్య అలాగే రావటం, ఒక్క జడ్జికి మాత్రమే కాకుండా, మిగతా వారికి కూడా ఇలాంటి ఇబ్బందులే రావటంతో, ఇది ఫోన్ ట్యాపింగ్ అంటూ, ఆ కధనం ప్రచురితం అయ్యింది. అయితే ఈ కధనంలో ఎక్కడా పలానా వ్యక్తి కాని, ప్రభుత్వం కాని ఈ పని చేస్తున్నట్టు రాయలేదు. అయితే నిన్న ప్రభుత్వం మాత్రం, ఈ విషయం పై సీరియస్ గా స్పందిస్తూ, ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు పంపించింది.

వచ్చిన కధనం పై క్షమాపణ చెప్పాలని, లేకపోతే క్రిమినల్ ఆక్షన్ తీసుకుంటామని చెప్పింది. అయితే ఈ ట్విస్ట్ ఇలా ఉండగానే, ఈ రోజు మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జడ్జిల ఫోన్ ట్యాపింగ్ పై, తాను రేపు హైకోర్టు లో పిల్ వేస్తున్నట్టు,. మాజీ జడ్జి న్యాయమూర్తి, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్రవణ్‌కుమార్ వెల్లడించారు. ఇది అత్యంత దారుణమైన విషయం అని, మన దేశంలో ఎప్పుడ ఇలాంటి పరిణామం జరగలేదని, దీని పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, తాను రేపు హైకోర్టు ముందుకు వెళ్తున్నాని అన్నారు. నిన్నటి నుంచి ఈ పరిణామం అనేక మలుపులు తిరుగుతుంది. నిన్న ఆంధ్రజ్యోతి కధనం రాయటం, ఎక్కడ ప్రభుత్వం చేసినట్టు చెప్పకపోయినా, ప్రభుత్వం మాత్రం క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులు పంపించటం, నేను ట్యాపింగ్ పై పిల్ వేస్తాను అని శ్రవణ్ కుమార్ చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే, ఈ పరిణామంలో ఒకవేళ కధనం తప్పు అయితే, అటు ఆంధ్రజ్యోతి కానీ, ఇటు ఈ ట్యాపింగ్ చేసింది నిజమే అయితే చేసిన వారు కానీ, బలి అవ్వటం ఖాయం. చివరకు ఇది ఎక్కడ తేలుతుందో చూడాలి.

Advertisements