జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, వైకాపా అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు.. చంద్రబాబు, మోడీ చేస్తున్న మోసం పై, ధర్మపోరాట దీక్ష చేస్తుంటే, జగన్ మాత్రం వంచన దీక్ష పేరిట నాటకాలు ఆడుతున్నారని, మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. చంద్రబాబు పోరాటానికి రాష్ట్రంలోనే కాకుండా, విదేశాల్లోని తెలుగువారు కూడా మద్దతు తెలియజేస్తే, జగన్ మాత్రం ప్రధాని మోడీకి మద్దతిస్తూ నయవంచన చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుజాతి పై కక్షగట్టి, కేంద్రం చేస్తోన్న అన్యాయాన్ని ఎదుర్కోకుండా, ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ నాటకాలు ఆడుతున్నారని, చంద్రబాబుని విమర్శిస్తున్న జగన్, ప్రత్యేక హోదా గురించి మోదీని, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

ప్రతి రోజు ఢిల్లీలో హడావుడి చేసిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, నేను మోడీ ఇంట్లోనే ఉంటాను అని చెప్పిన ఆయన, ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కోసం పని చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. ఆయనతో పాటు పలువురు వైకాపా నేతలు కర్ణాటకలో, గాలి అనుచరులను గెలిపించే పనిలో ఉన్నారని అన్నారు. కర్ణాటకలో బీజేపీకు ప్రచారం చేయడమంటే, తెలుగుజాతికి నమ్మకద్రోహం చేయడం కాదా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడేందుకు, ఈడీ నుంచి ఆస్తులు విడిపించుకోవటానికే జగన్, విజయసాయి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

అమిత్ షా కనుసన్నల్లోనే వైకాపా నడుస్తోందన్నారు. రాష్ట్రంలో భాజపా అధ్యక్ష పదవి ఖాళీగా ఉందని.. దాన్ని జగన్‌ తీసుకోవాలని ఎద్దేవా చేశారు. ఏపీలో ఎవరు ఏ పార్టీలో చేరాలనేది అమిత్ షా, ఢిల్లీ నుంచి నడిపిస్తున్నారని ఆరోపించారు. 40ఏళ్లు జగన్ కుటుంబానికి పదవులు ఇచ్చిన పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. పులివెందుల చుట్టూ ఉన్న నీళ్లు నెత్తిన జల్లుకుంటే జగన్ పాపాలు సగమైనా పోతాయని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి కాకుండా బయటి జిల్లాల్లో పోటీ చేయాల్సిందేనని అన్నారు.

Advertisements