మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరిని, అలాగే జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు అంటూ, ప్రెస్ మీట్ పెట్టి, ఎండగట్టారు. పోలవరం విషయంలో మీకు మొత్తం ఇచ్చేది 20 వేల కోట్లే అని కేంద్రం లేఖ రాసిందని ఉండవల్లి అన్నారు. ఇందులో ఇంకా కేవలం 7 వేల కోట్లు ఇస్తే సరిపోతుందని, కేంద్రం చెప్పిందని ఉండవల్లి అన్నారు. జల శక్తి మంత్రి శాఖ నుంచి, ఆంధ్రప్రేదేశ్ ప్రభుత్వానికి వచ్చిన లేఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది అవమానించాల్సిన లేఖ అని అన్నారు. పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని చెత్త బుట్టలో వేసి, వీళ్ళు ఇలా లేఖ మన మొఖాన కొట్టారని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు ఉన్నంత కాలం ఇలాంటి లేఖ రాకుండా ఆయన జాగ్రత్త పడ్డారేమో కానీ, ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా లేఖ రాసారని, దీని పై ఇప్పుటి ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ఉండవల్లి అన్నారు. అంగుళం కూడా తగ్గదని మంత్రులు అంటున్నారని, అసలు చర్చ ఇది కాదని, ఎత్తు ఎంత కడతారు అనేది చర్చ కాదని, అది ఎలాగూ అయిపోయింది, నీరు ఎంత నిలుపుతారు అనేది ఇక్కడ చర్చ అని ఉండవల్లి అన్నారు. 45 మీటర్లకు నీళ్ళు నిలిపితేనే, పోలవరం ప్రాజెక్ట్ ఉపయోగం అని, ఇన్నాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు అంటూ, ఈ 45 మీటర్లకు నిలిపితే, ముంపు ప్రాంతం ఉంటుంది కాబట్టి, ఇప్పటి వరకూ లేట్ అవుతూ వచ్చిందని, ఇక్కడ ఎత్తు సమస్య కాదని అన్నారు. పార్లమెంట్ లో చేసిన బిల్లులో, పోలవరం విషయంలో చట్టం చేసారని అన్నారు.

undvalli 28112020 2

పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని, ఎదో క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుందని అంటున్నారని, 2017 కేబినెట్‌ నోట్‌లో అసలు ఏముందని, ఈ హడావిడి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే, జగన్ మోహన్ రెడ్డి ఎందుకు స్పందించటం లేదని అన్నారు. ప్రతిపక్షాలు అంటున్నట్టు, నిజంగానే సిబిఐ కేసులకు జగన్ భయపడుతున్నారా అని ప్రశ్నిస్తూ, జగన్ ఇలాగే ఉంటే, ఆ ప్రచారం నిజం అని ప్రజలు నమ్ముతారని, ఇంత బలమైన ప్రభుత్వం ఉంచుకుని కూడా, పోలవరం ప్రాజెక్ట్ కు ఇంత అన్యాయం జరుగుతుంటే, ఎందుకు కేంద్రాన్ని నిలదీయటం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు ఎందుకు కడుతున్నారని, పాదయాత్రలో చెప్పిన జగన్, ఇప్పుడు ఎందుకు కేంద్రానికి ఇవ్వలేదని ప్రశ్నించారు. అసలు పోలవరం పై మీ పార్టీ స్టాండ్ ఏమిటి ? పోలవరం పై ఒక శ్వేత పత్రం విడుదల చేయండని ఉండవల్లి అన్నారు. ఇక రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని, అన్నీ నవరత్నాలు అంటూ హడావిడి చేస్తున్నారని, నవరత్నాలే ఓట్లు వేస్తాయని నమ్ముతున్నారని, ఉపాధి లేకుండా నవరత్నాలు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాయని ఉండవల్లి అన్నారు. మొత్తానికి, జగన్ మోహన్ రెడ్డి పై ఉండవల్లి కొద్దిగా డోస్ పెంచారు.

Advertisements