ఉరవకొండ నియోజకవర్గ వైసీపీ పంచాయితీ హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్‌కు చేరింది. చాప కింద నీరులా ఉన్న అసమ్మతి ఊవ్వెత్తున ఎగిసింది. తమ నాయకుడికి సీటు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ అధినేత వద్దే తాడోపేడో తేల్చుకోవడానికి వైసీపీ కార్యకర్తలు లోట్‌సపాండ్‌ వద్ద ఆందోళనకు దిగారు. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గానికి చెందిన నాయకులు బ స్సుల్లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లా రు. మంగళవారం ఉదయం లోటల్‌పాం డ్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ బైఠా యించి శివరామిరెడ్డికి ఉరవకొండ సీటు కేటాయించాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు ఉపక్రమించారు. అదే సమయంలో కార్యాలయంం నుంచి బయటకు వస్తున్న వైఎస్‌ వివేకానందరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుని తమగోడును వెల్లబోసుకున్నారు.

police 13032019

ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఏకపక్షధోరణితో తమను, తమ నాయకున్ని దూరంగా ఉంచారని ఆరోపించా రు. అధికార పార్టీ దూకుడుకు కళ్లేం వేసే సత్తా శివరామి రెడ్డికి మాత్రమే ఉందన్నారు. వివేకానందరెడ్డి పార్టీ నాయకుల కు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు సమ్మతించలేదు. దీంతో పార్టీ అధినేతతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం ఉంటుందని శివరామిరెడ్డి వర్గీయులు తెలిపారు. లోట్‌సపాండ్‌ కు తరలివెళ్లిన వారిలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ రమణ యాదవ్‌, ఎంపీటీసీ సభ్యుడు విజయ్‌, పార్టీ నాయకులు కోనాపురం హనుమంతు, ముష్టూరు ఎర్రిస్వామి, రేణుమాకుల పల్లి రామాంజినేయులు తదితరులు ఉన్నారు.

 

Advertisements