పవన్ కళ్యాణ్ నటించిన వకీల్‍సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై రెండు రోజులుగా వివాదం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలు పెంచవద్దు అని ఆదేశాలు ఇవ్వటం, హైకోర్టుకు వెళ్ళగా, మూడు రోజులు వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని సింగల్ జడ్జి ఆదేశాలు ఇవ్వటం, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అత్యవసరంగా హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందు హౌస్ మోషన్ పిటీషన్ వేయటం తెలిసిందే. ఈ హౌస్ మోషన్ పిటీషన్ పై, ఈ రోజు హైకోర్టులో రెండు వైపుల నుంచి వాదనలు ముగిసాయి. అయితే సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పుని హైకోర్టు డివిజనల్ బెంచ్ కొద్దిగా సవరించింది. సింగల్ బెంచ్ మూడు రోజులు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని చెప్పగా, హైకోర్ట్ డివిజనల్ బెంచ్ మాత్రం, రెండు రోజులు వరకు పెంచుకోవచ్చని, మూడో రోజు ఆన్లైన్ లో బుక్ చేసిన టికెట్ లకు కాకుండా, మిగతా టికెట్ ల విషయంలో, రేట్లు పెంచవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటీషన్ లో ఎవరు గెలిచారో, ఎవరు ఓడిపోయరో చెప్పటం కంటే, అసలు దీని కోసం కూడా, ఒక్క రోజు కోసం, అత్యవరంగా ప్రభుత్వం పిటీషన్ వేయటం వెనుక ఆంతర్యం ఏమిటో, ఎవరికీ అర్ధం కావటం లేదు. ఏది ఏమైనా ఎవరినా, కోర్టు ఆదేశాలు పాటించాల్సిందే.

Advertisements