వైసీపీలో అసమ్మతి జ్వాలలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. విజయవాడ పశ్చిమ సెగ్మెంట్‌లో ముస్లిం మైనారిటీలకు టికెట్ ఇవ్వాలంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆర్ఎస్ఎస్‌కు చెందిన వెల్లంపల్లి శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వొద్దంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు వీర్ల అప్పిరెడ్డి తదితరులు వచ్చి వైసీపీ కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. జగన్‌తో మాట్లాడేందుకు పది సార్లు హైదరాబాద్ లోటస్‌పాండ్‌కు వెళ్లినా కనీసం కలిసేందుకు అవకాశం ఇవ్వలేదంటూ ముస్లిం మైనారిటీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలను బుజ్జింగించిన అప్పిరెడ్డి.. జగన్ దగ్గరకు తీసుకెళతామని హామీ ఇచ్చారు.

radha 19032019

విజయవాడ పశ్చిమ నియోజకర్గం ముస్లిం మైనారిటీలకు సంబంధించిన సీటు అని, అలాంటి స్థానాన్ని ఆరెస్సెస్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారంటూ వైకాపా అసంతృప్త నేత ఎంఎస్‌ బేగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల తర్వాత పరిస్థితి సర్దుకుంటుందని అప్పిరెడ్డి చెప్పగా... బేగ్‌ మాత్రం ఈ విషయంపై పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఎలా స్పందిస్తారో చూశాక తన నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. ఒక్క గుంటూరు మినహా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడా ముస్లింలకు అవకాశం కల్పించలేదని విమర్శించారు. పొన్నూరు వైసీపీలోనూ అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. రావిని కాదని కిలారి రోశయ్యకు టికెట్ కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు విశాఖ జిల్లా యలమంచలి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన ముగ్గురు సమన్వయకర్తలు పార్టీకి రాజీనామా చేశారు.

radha 19032019

ప్రకాశం జిల్లా పర్చూరులో అసంతృప్త నేత రావి రామనాథంబాబు వైకాపాకు రాజీనామా చేసి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. పాలకొల్లు నేత గుణ్ణం నాగబాబు విజయవాడలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు. పాలకొల్లులో పోటీ చేసేందుకు తనకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. పవన్‌ కూడా నాగబాబును పాలకొల్లు జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. విశాఖ తూర్పు, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో టికెట్‌ దక్కని వైకాపా నేతలు వంశీకృష్ణ, కోళా గురువులు మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. పెడనలో రాంప్రసాద్‌, కొండపిలో అశోక్‌ ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి సిద్ధమవుతున్నట్లు వారి అనుచరులు చెబుతున్నారు.

Advertisements