ఈ రోజు తెల్లవారు జామున, విజయవాడలోని ఏలూరు రోడ్డులోని, చల్లపల్లి బంగ్లావద్ద స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్వర్ణా ప్యాలెస్ ని, ఇటీవలే కవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు. దీన్ని ఒక ప్రైవేటు హాస్పిటల్ కు కవిడ్ సెంటర్ గా మార్చారు. ఇందులో 40 గదులు ఉండగా, మొత్తం 30 మందికి చికిత్స చేస్తున్నారని, మరొక 10 మంది సిబ్బంది ఉన్నారని సమాచారం. అయితే ఆ మంటలకు ఊపిరి ఆడక, ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయినట్టు సమాచారం. మరొక ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. పేషెంట్లు ఎక్కువ అవ్వటంతో, హాస్పిటల్ లో బెడ్లు సరిపోక, ఖాళీగా ఉన్న హోటల్స్ ని తీసుకున్నారు. ఈ రోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ ద్వారా, మంటలు వ్యాపించినట్టు భావిస్తున్నారు. ఘటన విజయవాడ సెంటర్ లో జరగటంతో, వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించారని, అలాగే సహాయక చర్యలు చేపడటానికి టైం దొరకటంతో, భారీ ప్రమాదం తప్పినట్టు అయ్యిందని చెప్తున్నారు

ఘటనా స్థలంలో విజయవాడ పోలీస్ కమీషనర్ దగ్గర ఉండి సహాయక చర్యలు చేస్తున్నారు. ఘటన గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగిందని, తరువాత మంటలు, ఫస్ట్ ఫ్ల్లోర్ లోకి వ్యాపించాయని చెప్తున్నారు. మంటలకు కిందకు రాలేక, ఊపిరి ఆడక, అక్కడ ఉన్న రోగులు హాహాకారాలు పెట్టారు. ఒక ఇద్దరు ధైర్యం చేసి, కిటికీలో నుంచి దూకారని, వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారని చెప్తున్నారు. మిగతా రోగులని, దగ్గరలో ఉన్న కవిడ్ సెంటర్లకి తరలించారు. ఇప్పటికి మంటలు అదుపులోకి వచ్చాయని, లోపలకు వెళ్లి ఎవరైనా ఇంకా చిక్కుకున్నారా అనే విషయం పై, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చూస్తున్నారు. మొత్తం 30 మంది రోగులు ఉన్న ఈ కవిడ్ కేర్ సెంటర్ లో, ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారని, ఇద్దరి పరిస్థితి ఆందోళనగా ఉందని, మిగతా వారి పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisements