విజయసాయి రెడ్డి... ఈయన రాజ్యసభ సభ్యుడే అయినా, జగన్ మోహన్ రెడ్డికి కుడి భుజంగా బాగా గుర్తింపు. జగన్ కంపెనీల్లో ప్రధాన ఆడిటర్ గా ఉన్న విజయసాయి రెడ్డి కూడా, జగన్ కేసుల్లో ప్రధాన పాత్ర అని భావించి, సిబిఐ విజయసాయి రెడ్డిని ఏ2గా పెట్టి, అరెస్ట్ చేసింది. జగన్ తో కలిసి, విజయసాయి రెడ్డి కూడా జైలు జీవితం అనుభవించారు. అప్పటి నుంచి జగన్ మొహన్ రెడ్డికి అన్ని విధాలుగా విజయసాయి రెడ్డి అండగా ఉంటున్నారు. ముఖ్యంగా 2014 తరువాత, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య గ్యాప్ తెప్పించాతంలో, ఆయన రాజకీయ వ్యూహాలు ఫలించాయి. అదే సందర్భంలో, బీజేపీ అధిష్టానానికి బాగా దగ్గర అయిపోయారు విజయసాయి. ప్రతిపక్షంలో ఉండగా, విజయసాయి రెడ్డి ఎక్కువగా ప్రధాని కార్యాలయంలో కనిపిస్తూ ఉండేవారు. అయితే విమర్శలు వచ్చినా సరే, నేను ఇలాగే వెళ్తాను, చంద్రబాబుని ఓడించటమే నా ధ్యేయం అని చెప్పారు కూడా.

vsreddy 14092019 1

అయితే మొత్తానికి అందరూ కలిసి చంద్రబాబుని ఓడించారు. చంద్రబాబుని ఓడించే పాత్రలో విజయసాయి రెడ్డికి ఎక్కువ మార్కులే వెయ్యాలి. ఢిల్లీ లెవెల్లో చెయ్యాల్సిన లాబీయంగ్ అంతా పర్ఫెక్ట్ గా చేసుకొచ్చారు. అందరూ సహకరించారు కూడా. మొన్నా మధ్య, సాక్షాత్తు ప్రధాని మోడీ, హలో విజయ్ గారు అంటూ పలకరించిన వీడియో కూడా చూసాం. అయితే అంత రిలేషన్ ఉన్న, విజయసాయి రెడ్డి, బీజేపీ అధిష్టానం మద్యం, గత కొంత కాలంగా గ్యాప్ వచ్చిందని ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. బీజేపీ అధిష్టానం కూడా, విజయసాయి రెడ్డిని దూరం పెట్టిందని, ఇది వరకటి లాగా ఉన్న స్వేఛ్చ విజయసాయి రెడికి లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, విజయసాయి రెడ్డి చూపిన అత్యుత్సాహంగా చెప్తున్నారు.

vsreddy 14092019 1

ఒక పక్క జగన్ మొహన్ రెడ్డి చేస్తున్న పనుల పై,కేంద్రం సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యుత్ ఒప్పందాల విషయంలో, పోలవరం రీటెండరింగ్ విషయంలో కూడా కేంద్రం ఆగ్రహంగా ఉంది. వారం క్రితం సాక్షాత్తు కేంద్ర మంత్రి, జగన ని పట్టుకుని, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని బహిరంగంగా అన్నారు అంటే, విషయం ఎక్కడి వరకు వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఇదే సమయంలో విజయసాయి రెడ్డి మాత్రం, విద్యుత్ ఒప్పందాలు కాని, పోలవరం కాని, అన్ని విషయాలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. ఇదే విషయం ఢిల్లీలోని బీజేపీ అధిష్టాననికి కోపం తెప్పించింది. మీరు చేసే పనులకు, మమ్మల్ని బాధ్యులని చేస్తారా అంటూ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తింది. దీంతో అప్పటి నుంచి, విజయసాయి రెడ్డిని దూరం పెడుతూ, ఇది వరకు ఇచ్చినంత స్వేఛ్చ ఇప్పుడు ఇవ్వటం లేదని సమాచారం. మాటి మాటికి ఢిల్లీలో లాబీయింగ్ చేసే విజయసాయి రెడ్డికి, ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

Advertisements