వివేక కేసు గత రెండేళ్ళుగా తేలటం లేదు. సొంత కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆ కుటుంబానికి న్యాయం జరగటం లేదు. ఆడ కూతురు ఢిల్లీ వీధుల్లో నాకు న్యాయం చేయండి అని, అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కేసు విషయంలో, గత వారం కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు , సిబిఐకి రాసిన లేఖ కలకం రేపింది. ఆయన తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సిబిఐకి లేఖ రాసారు. ఎన్ని సార్లు అడిగినా సిబిఐ స్పందించటం లేదని అన్నారు. అయితే ఏబి వ్యాఖ్యల పై ఏపి పోలీసులు ఫైర్ అయ్యారు. డీఐజి పాలరాజు మాట్లాడుతూ, ఏబి పై ఫైర్ అయ్యారు. ఆధారాలు ఉంటే తమకు ఎందుకు ఇవ్వలేదని అన్నారు. అలాగే అనేక విమర్శలు చేసారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఆయన మాట్లాడుతూ, జగన్ కుటుంబ సభ్యులను , ఏబి ఇరికించే ప్రయత్నం చేసారని, వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసారు అంటూ, ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఒక పక్క వివేక కుమార్తే, అనేక మంది కుటుంబ సభ్యుల పై కూడా ఆరోపణలు చేస్తుంటే, అంత పెద్ద ఆఫీసర్, దర్యాప్తు పై ప్రభావం చూపేలా, జగన్ కుటుంబాన్ని ఇరికించే ప్రయత్నం చేసారు అనటం, వారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టా ? ఇప్పటికే సిబిఐ విచారణ నత్తనడకన నడుస్తుందని ఆరోపణలు వస్తుంటే, పోలీసులు ఇలా ఎందుకు అంటున్నారో మరి.

Advertisements