ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల, ప్రచార హడావుడిలో బిజీగా ఉండగా.. ఆయా పార్టీల తరపున ప్రయివేటు ఏజన్సీల సర్వే బృందాలు జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సర్వే టీమ్‌లు కాకినాడ, రాజమహేంద్రవరంలలో మకాం వేసి ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. ఏ సంస్థ ఏ పార్టీ తరపున సర్వే నిర్వహిస్తుంది? అనేదానిపై బయటకు తెలియకపోయినా, ప్రధానంగా వైసీపీ, టీడీపీల తరపునే ఎక్కువ సంస్థలు సర్వేలు చేపట్టాయి.

aadala 16032019

సంక్షేమ పథకాలపై ఎఫెక్ట్‌ ఎంత? టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలపై ప్రజలలో ఏ మేరకు ప్రభావం ఉంది? సానుకూలత ఏమేరకు ఉంది? అనే అంశంపై ప్రతిష్టాత్మక సర్వే సంస్థ నాలుగు రోజులుగా జిల్లాలో ఆరా తీస్తోంది. పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, యువనేస్తం, పదిరెట్లు పెంచిన పింఛను.. ఇలా పేదల కోసం పెట్టిన పలు పథకాల ప్రభావం ఏ మేరకు సానుకూలత తెస్తుంది? అనేదానిపై తటస్థులైన వివిధ వర్గాల వారిని సర్వే చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యోదంతం తర్వాత పరిస్థితి? వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చిన్నాన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాలపై ప్రజల్లో ఏ అభిప్రాయం ఉంది? సామాన్యులు ఏమనుకుంటున్నారు? ఈ ఘటనలో సీఎం చంద్రబాబుపై జగన్‌ వేసిన నిందలపై సానుకూలత వచ్చిందా? రివర్స్‌ అయిందా? అనేదానిపై సర్వే బృందాలు లోతుగా ఆరాతీస్తున్నాయి.

aadala 16032019

జగన్‌కి అధికారం కట్టబెడితే ఎదురయ్యే పరిస్థితులపై జనంలో ఏ మేరకు భయాందోళనలు నెలకొన్నాయి? అనేదానిపై ప్రశాంత్‌ కిషోర్‌ బృందం ప్రత్యేక ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో కొన్ని సీట్లలో జనసేన చీల్చే ఓట్ల ప్రభావం ఏ పార్టీపై ఉంటుందనేదానిపైనా ఒకటి, రెండు సంస్థలు లోతుగా సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీలలో జనసేన అభ్యర్థులకు ఎంత శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది? ఆ పర్సెంటేజీ వల్ల వైసీపీ, టీడీపీలలో ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అవుతుందనేదానిపైనా సర్వే సంస్థలు తర్జనభర్జనపడుతున్నాయి. అలాగే కోనసీమ, రాజమహేందవ్రరం పరిధిలోనూ జనసేన ఎఫెక్ట్‌ ఎంత ఉంటుందనేదానిపై సర్వే సంస్థలు ప్రత్యేకంగా ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యాయి.

Advertisements