రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌ను అరెస్టు చేసినట్టు పులివెందుల పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. హత్యానంతరం సాక్ష్యాలు తారుమారు చేసిన వ్యవహారంలో ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. ఈ నెల 15న ఉదయం స్నానాల గదిలో హత్యకు గురైన వివేకా మృతదేహాన్ని పడక గదికి తరలించినట్టు గుర్తించిన పోలీసులు.. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్టు భావిస్తున్నారు. ఉదయం లేఖ దొరికినా సాయంత్రం వరకు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదనే కారణంతో ఆయన పీఏ కృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

remand 28032019

అయితే, కోర్టుకు సమర్పించిన రిపోర్టులో కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. సంఘటనా స్థలంలోనే వివేకా మృతదేహానికి బట్టలు మార్చారని వివేకా హత్య కేసు రిమాండ్‌ రిపోర్టులో స్పష్టమైంది. దాదాపు రెండు లీటర్ల రక్తాన్ని తుడిచారు..గాయాలకు కట్లు కట్టారని, రక్తంలో తలవెంట్రుకలు, బొట్టు బిళ్లలు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఘటనాస్థలిలో లేఖను దాచారు...కొందరికి ఫోన్లు చేశారని, మృతదేహాన్ని వారే ఘటనాస్థలి నుంచి మార్చురీకి తరలించారు. కావాలనే సాక్ష్యాధారాలను రూపుమాపడానికి యత్నించారని, ఇలా చేయాలని వారికి ఎవరు చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని దర్యాప్తు అధికారులు తెలిపారు.

remand 28032019

15 రోజుల కస్టడీకి ఇస్తే అసలు గుట్టు రాబడుతామని, ఈ కేసులో ఇప్పటికే పదుల సంఖ్యలో వ్యక్తులను విచారించారు. గంగిరెడ్డి, కృష్ణారెడ్డి చెప్పినట్లుగా పనిమనిషి లక్ష్మి కొడుకు ప్రకాష్‌ రక్తాన్ని తుడిచారని రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. ఎన్నికల వేళ సంచలనం రేపిన ఈ కేసును ఏపీ పోలీసుల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని వివేకా హత్యపై కూపీలాగుతున్నారు. ఐతే వైఎస్ జగన్‌తో పాటు వివేకా కుటుంబ సభ్యులు మాత్రం సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం కేసును పక్కదారి పట్టిస్తోందని..ఏపీ ప్రభుత్వంతో సంబంధంలేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు దర్యాప్తుచేయాలని కోరుతున్నారు. అటు హైకోర్టులోనూ పలు పటిషన్లు దాఖలయ్యాయి.

Advertisements